OIC: అన్ని మ‌తాలను గౌర‌వించాల‌ని మేమే మిమ్మ‌ల్ని కోరుతున్నాం: భార‌త్ ఘాటు స్పంద‌న‌

మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ‌తో పాటు ఆ పార్టీకి చెందిన‌ న‌వీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జ‌న‌ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ ఖండించింది.

OIC: అన్ని మ‌తాలను గౌర‌వించాల‌ని మేమే మిమ్మ‌ల్ని కోరుతున్నాం: భార‌త్ ఘాటు స్పంద‌న‌

Up Violance

OIC: మ‌హ‌మ్మ‌ద్ ప్ర‌వ‌క్త‌పై బీజేపీ నాయ‌కురాలు నురూప్ శర్మ‌తో పాటు ఆ పార్టీకి చెందిన‌ న‌వీన్ కుమార్‌ జిందాల్‌ అనుచిత వ్యాఖ్య‌లు చేశారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జ‌న‌ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్ చేసిన ప్ర‌క‌ట‌న‌ను భార‌త్ ఖండించింది. భార‌త్‌లో ముస్లిం ప‌ట్ల ప్ర‌ద‌ర్శిస్తోన్న వైఖ‌రి స‌రికాదంటూ ఓఐసీ ఓ ప్ర‌క‌ట‌న చేసిన విష‌యం తెలిసిందే. భార‌త్‌లో ముస్లింల ప‌ట్ల విద్వేషాన్ని ప్ర‌ద‌ర్శిస్తున్నార‌ని, క్ర‌మ‌బ‌ద్ధంగా వారిని వేధిస్తున్నారని వారి ఆస్తుల‌పై కూడా దాడులు జ‌రుగుతున్నాయ‌ని పేర్కొంది. దీనిపైనే భార‌త్ ఘాటుగా స్పందించింది.

Uttar Pradesh Violence: అలాంటి వారిని బీజేపీ నుంచి తొల‌గిస్తే స‌రిపోదు: మాయావ‌తి

”ఈ వివాదంపై ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జ‌న‌ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్‌ చేసిన ప్ర‌క‌ట‌న అసమంజ‌సంగా, సంకుచిత స్వ‌భావంతో చేసిన‌దిగా ఉంది. ఈ ప్ర‌క‌ట‌న‌ను భార‌త ప్ర‌భుత్వం తిర‌స్క‌రిస్తోంది. భార‌త ప్ర‌భుత్వం అన్ని మ‌తాల‌నూ గౌర‌విస్తుంది. ఓ మ‌తానికి చెందిన ప్ర‌వ‌క్త‌ను కించ‌ప‌ర్చుతూ ఇటీవ‌ల‌ కొంద‌రు చేసిన‌ అనుచిత వ్యాఖ్య‌లు, ట్వీట్లు వారి వ్య‌క్తిగ‌తం. వ్య‌క్తిగ‌తంగా వారు చేసిన‌ వ్యాఖ్య‌లు ఏ విధంగానూ భార‌త ప్ర‌భుత్వ వైఖ‌రిని ప్ర‌తిబింబించేవి కాదు” అని భారత్ పేర్కొంది.

Delhi: ఢిల్లీ మంత్రి స‌త్యేంద‌ర్ జైన్ నివాసం, కార్యాలయాల్లో ఈడీ సోదాలు

”అనుచిత వ్యాఖ్య‌లు చేసిన వారిపై సంబంధిత ప్ర‌భుత్వ‌ శాఖ‌లు ఇప్ప‌టికే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకున్నాయి. అయిన‌ప్ప‌టికీ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ (ఓఐసీ) జ‌న‌ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్ త‌ప్పుడు ప్ర‌క‌ట‌న చేయ‌డం విచార‌క‌రం. ఐఓసీ చేసిన ప్ర‌క‌ట‌న ఆ సంస్థ‌ వేర్పాటువాద అజెండాను తెలియ‌జేసేలా ఉంది. ఇటువంటి మ‌త‌ప‌ర‌ విధానాల‌ను మార్చుకోవాల‌ని ఓఐసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌టేరియ‌ట్‌ను మేము కోరుతున్నాం. అన్ని మ‌తాలు, విశ్వాసాల‌ను గౌర‌వించాల‌ని విన్న‌వించుకుంటున్నాం” అని భార‌త విదేశాంగ శాఖ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది.