బిలియన్ ఏళ్ల భూమి కదిలికలు ఎలా ఉండేవో ఈ వీడియోలో చూడొచ్చు!

బిలియన్ ఏళ్ల భూమి కదిలికలు ఎలా ఉండేవో ఈ వీడియోలో చూడొచ్చు!

Earth Rotates from billion years : గత బిలియన్ ఏళ్ల నుంచి భూమి టెక్టోనిక్ ప్లేట్ల నిరంతర కదలికను మొదటిసారిగా చూపించే ఒక వీడియోను జియోసైంటిస్టులు విడుదల చేశారు. భూమి ఉపరితలం చుట్టూ భూద్రవ్యరాశి కదులుతున్నప్పుడు స్థిరమైన కదలికలో ఒక గ్రహాన్నిసూచిస్తుంది. అంటార్కిటికా ఒకప్పుడు భూమధ్యరేఖ వద్ద ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి మార్చి 2021లో ఎర్త్-సైన్స్ రివ్యూస్ ఎడిషన్‌లో కొత్త పరిశోధన ఆధారంగా ఈ వీడియో రూపొందించారు. గత బిలియన్ సంవత్సరాల్లో భూమి పరిణామం పూర్తిగా కొత్త నమూనాగా మారిపోయిందని సిడ్నీ యూనివర్శిటీ ఎర్త్‌బైట్ జియోసైన్సెస్ గ్రూప్ ప్రొఫెసర్ డైట్మార్ ముల్లెర్ అన్నారు.

ప్లేట్ టెక్టోనిక్స్ వంటి భౌగోళిక ప్రక్రియలు గ్రహాల జీవిత-సహాయక వ్యవస్థను అందిస్తాయని గుర్తించారు. ఈ వీడియోకు సంబంధించి ప్రాజెక్టును రచయిత డాక్టర్ ఆండ్రూ మెర్డిత్ ప్రారంభించారు. భూగ్రహంపై ఖండాలు సంవత్సరానికి సెంటీమీటర్లలో కదులుతాయి. కానీ, యానిమేషన్ లో మాత్రం ఖండాలు సమయానుసారంగా ప్రతిచోటా ఉన్నట్టుగా కనిపించాయి. అంటార్కిటికాలో చల్లని, మంచుతో నిండి ఉంటుంది. ప్లానెట్ ఎర్త్ చాలా డైనమిక్, ఉపరితలం ప్లేట్’లతో కూడి ఉంటుంది. ఈ ప్లేట్లు వేగంతో కదులుతాయని అంటున్నారు సైంటిస్టులు. ఇలా కదిలే క్రమంలో మహాసముద్రాలు మూసివేయడం, ఖండాలు చెదరిపోతుంటాయి.

అలా సూపర్ కాంటినెంట్లు ఏర్పడుతుంటాయి. ప్రతి ఖండానికి చెందిన బిలియన్ సంవత్సరాల నమూనాను రూపొందించడానికి మారుమూల ప్రాంతాల నుంచి డేటాను సేకరించి భూ శాస్త్రవేత్తలు గత నాలుగు ఏళ్లుగా ప్రచురించారు. ప్లేట్ టెక్టోనిక్స్ లేకుండా భూమిపై జీవితం ఉండదు. భూవాతావరణం ఎలా మారింది.. జీవం ఎలా పుట్టింది.. సముద్ర ప్రవాహాలు ఎలా మారిపోయాయో లోతైన భూమి నుంచి పోషకాలు ఎలా ఆవిర్భవించాయో అర్థం చేసుకునేందుకు ఈ నమూనా శాస్త్రవేత్తలకు సాయపడుతుంది. మన ఇల్లు, ప్లానెట్ ఎర్త్, సంక్లిష్ట జీవులకు ఎలా నివాసయోగ్యంగా మారిందో వివరించడానికి సహాయపడుతుంది.