Teeth Brushing : సంపూర్ణ ఆరోగ్యానికి రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలంటే!

పళ్లు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ వాడేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని దంతవైద్యులు చెబుతున్నారు. పుక్కిలించడం వల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు, క్రిములు తొలగిపోతాయి. రెండేళ్ళ వయస్సు దాటిని పిల్లలకు బ్రషింగ్ చేయించాలి.

Teeth Brushing : సంపూర్ణ ఆరోగ్యానికి రోజుకు ఎన్నిసార్లు బ్రష్ చేయాలంటే!

Teeth Brushing : ప్రతి ఒక్కరు నిద్రలేవగానే దంతదావనం చేయటం అలవాటు. నోటి ఆరోగ్యం కోసం దంతాలను శుభ్రపరుచుకోవటం తప్పనిసరి. రాత్రంతా నిద్ర పోయిన తర్వాత పొద్దున లేవగానే నోటి నుండి దుర్వాసన వస్తుంది. అలాగే నోటిని శుభ్రంగా ఉంచుకోవాలంటే పళ్లు, నోరు శుభ్రపరుచుకోవాలి. ప్రతిరోజు బ్రష్ చేసుకోవడం వల్ల నోటిని ఆరోగ్యంగా ఉంచుకోవటంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సొంతమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు. నోటి శుభ్రత పాటించకపోవటం వల్ల నోటిలో తయారయ్యే బ్యాక్టీరియా గుండె సంబంధిత జబ్బులు, క్యాన్సర్, డయాబెటిస్ వంటి దీర్ఘలాకి వ్యాధుల బారిన పడే ప్రమాదాన్ని పెంచుతుంది. కాబట్టి రోజూ పళ్లు తప్పనిసరిగా బ్రష్ చేసుకోవాలని అంటారు వైద్య నిపుణులు.

పళ్లు తోముకోకుండా కేవలం మౌత్ వాష్ వాడేస్తుంటారు. ఇలా చేయటం ఏమాత్రం మంచిది కాదని దంతవైద్యులు చెబుతున్నారు. పుక్కిలించడం వల్ల దంతాల మధ్య ఇరుక్కుపోయిన ఆహార పదార్థాలు, క్రిములు తొలగిపోతాయి. రెండేళ్ళ వయస్సు దాటిని పిల్లలకు బ్రషింగ్ చేయించాలి. పిడియాట్రిక్ టూత్ పేస్టుతోనే పళ్లను శుభ్రం చేయాల్సి ఉంటుంది. పెద్దలకు దంతాల శుభ్రత ఎంత ముఖ్యమో పిల్లలకూ అంతే ముఖ్యం. పళ్లు తోముకోవడానికి మరీ సాఫ్ట్ బ్రష్ వాడకూడదు. అలాగని మరీ హార్డ్ బ్రష్ కూడా వాడొద్దని డెంటిస్టులు చెబుతున్నారు. హార్డ్ గా ఉండే బ్రష్ ల కారణంగా దంతాలపై ఉండే ఎనామిల్ పొర తొలిగిపోతుంది.

రోజులో ఒక్క సారి కంటే రెండు సార్లు పళ్లు తోముకునే వారి దంతాలు శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంటాయి. ఉదయం చేసే బ్రషింగ్ వల్ల నోటి దుర్వాసన పోవడంతో పాటు నోరు శుభ్రం అవుతుంది. అలాగే రాత్రి అన్నం తిని పడుకునే ముందు బ్రషింగ్ చేయడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహార పదార్థాలు, క్రిములు పోతాయి. టూత్ పేస్టు ఎక్కువగా కాకుండా తక్కువ మొత్తంలో బ్రష్ పై పెట్టుకోవాలి. ఎక్కువ సేపు కాకకుండా 3నిమిషాలపాటు బ్రష్ చేయాలి. అదే పనిగా గంటల తరబడి దంతాలను శుభ్రపరిస్తే పళ్లపై ఉండే ఎనామిల్ పొర పోతుంది. దీని వల్ల ఏమి తీసుకున్న పళ్లు జివ్వుమని లాగుతూ ఇబ్బందిని కలిగిస్తాయి.