Ghee : రోజుకు ఎంతపరిమాణంలో నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలోని కణాలు ,కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగా ఉంచుతుంది.

Ghee : రోజుకు ఎంతపరిమాణంలో నెయ్యి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది?

Ghee

Ghee : రోజువారీ ఆహారంలో నెయ్యిని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవటంతోపాటు అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాచీన కాలం నుండి, నెయ్యి అనేది అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. నెయ్యిని కొవ్వుగా వర్ణించినప్పటికీ వంట చేయడానికి ఉపయోగించే ఇతర నూనెల కంటే నెయ్యి ఉత్తమంగా పరిగణించబడుతుంది. నెయ్యి పూర్తిగా సహజమైనది. ట్రాన్స్ ఫ్యాట్ లేనిది. నెయ్యిలో ఆరోగ్యకరమైన ఆమ్లం, విటమిన్ B 2, విటమిన్ B12, విటమిన్ B6, విటమిన్ C, విటమిన్ E వంటి ఇతర పోషకాలు ఉన్నాయి. అంతేకాకుండా విటమిన్ల మూలం. నెయ్యిలో ఒమేగా -3 మరియు ఒమేగా 6 కొవ్వు ఆమ్లాలు ఉన్నాయి. మెదడు, గుండె మరియు నాడీ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

నెయ్యిలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్, యాంటీఆక్సిడెంట్ లక్షణాలు ఉన్నాయి మరియు ఇది వైరస్లు, ఫ్లూ, దగ్గు, జలుబు మొదలైన వాటికి వ్యతిరేకంగా పోరాడుతుంది. శరీరంలోని కణాలు ,కణజాలాలను దెబ్బతినకుండా కాపాడుతుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మరియు అందంగా ఉంచుతుంది. ప్రకాశవంతమైన కంటి చూపు, క్యాన్సర్ నివారణ, మలబద్ధకం నివారణకు తోడ్పడుతుంది.రోజువారీ ఆహారంలో కొద్దిగా నెయ్యి ఉంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

వాస్తవానికి నెయ్యి ఎంతపరిమాణంలో తీసుకుంటే మంచిదన్న విషయంపై నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. నెయ్యిని అధిక మోతాదులో తీసుకోవటం వల్ల అనేక అనారోగ్య సమస్యలకు కారణమౌతుంది. దీనిని నిర్ధేశిత పరిమితుల్లో తీసుకోవటం వల్ల శరీరానికి మంచి మేలు జరుగుతుంది. వివిధ వయస్సుల్లో ఉన్న వారు రోజు వారిగా ఎంత నెయ్యిని తీసుకుంటే ఆరోగ్యానికి ప్రయోజనం కలుగుతున్న దానిపై పెద్దలు, మహిళలు రోజుకు రెండు టీ స్పూన్లు మాత్రమే నెయ్యిని తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ వాడరాదు. అలాగే గర్భిణీ మహిళలు 3 టీ స్పూన్ల వరకు తీసుకోవచ్చు. 6 నెలల శిశువుకు అన్న ప్రాసన తరువాత 2 నుండి 3 టీ స్పూన్ల వరకు నెయ్యిని రోజు వారిగా అందించవచ్చు. 9 నుండి 17 సంవత్సరాల పిల్లలకు రోజుకు 3 టీస్పూన్ల నెయ్యిని వివిధ రూపాల్లో తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే వివిధ రకాల వ్యాధులతో బాధపడుతున్న వారు మాత్రం వైద్యుల సూచనలు, సలహాలతో మాత్రమే నెయ్యిని తీసుకునే పరిమాణం అధారపడి ఉంటుంది.