Water : రోజులో ఏసమయంలో ఎంతమోతాదులో నీటిని తాగాలంటే!

ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సూచిస్తున్నారు. వ్యాయామాలు చేసే ముందుగా రెండు గ్లాసుల నీటిని సేవించండి.

Water : రోజులో ఏసమయంలో ఎంతమోతాదులో నీటిని తాగాలంటే!

Drinking Water

Water : శరీరంలో జీవక్రియలకు నీళ్లు తాగటం అత్యవసరం. అందుకే నీటిని జీవామృతంగా పిలుస్తారు. నీటిని రోజువారిగా అవసరమైన మేర శరీరానికి అందించకుంటే వివిధ రకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయి. బరువు తగ్గటం మొదలు, కిడ్నీలో రాళ్లు వంటి సమస్యల వరకు మన దరి చేరకుండా ఉండాలంటే తప్పనిసరిగా రోజువారిగా సరిపడిన మోతాదులో నీటిని సేవించాల్సిన అవసరం ఉంది. శరీరానికి తగినంత నీరు అందించటం వల్ల జీర్ణక్రియ, మెదడు పనితీరు, శ్వాసక్రియ, పోషకాల రవాణా, శోషణకు నీరు తోడ్పడుతుంది.

రోజులో ఎన్ని లీటర్లు తాగలన్న దానిపై విశ్లేషిస్తే శరీరతత్వం, శారీరక శ్రమల స్ధాయి, వాతావరణం తదితర అంశాలు మనం తీసుకునే నీరు ఎంత పరిమాణంలో తీసుకోవాలన్న విషయాన్ని నిర్ధేశిస్తాయి. అయితే రోజుకు మాత్రం 8 నుండి 10 గ్లాసుల నీరు తప్పనిసరిగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్న మాట.

ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సూచిస్తున్నారు. వ్యాయామాలు చేసే ముందుగా రెండు గ్లాసుల నీటిని సేవించండి. దీనివల్ల అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. టిఫిన్, భోజనం ఇలా ఏ ఆహారానికైనా అరగంట ముందు గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల జీర్ణవ్యవస్థ బాగా పనిచేస్తుంది.స్నానం చేసే ముందు ఒక గ్లాసు నీళ్లు తాగాలి. దీనివల్ల రక్తపోటు రాకుండా కాపాడుకోవచ్చు. రాత్రి పడుకోవడానికి అరగంట ముందు ఒక గ్లాసు నీళ్లు తాగడం వల్ల గుండెపోటు వచ్చే అవకాశాలు తక్కువ.

శరీరానికి తగినంత నీటిని అందించటం వల్ల డీహైడ్రేషన్ సమస్యలు రాకుండా ఉంటాయి. ఉదయం లేవగానే తప్పనిసరిగా రెండు గ్లాసుల నీళ్లు తాగాలన్నది నిపుణుల సలహా. దీనివల్ల అన్ని అవయవాలు సక్రమంగా పని చేస్తాయి. సాధారణంగా చెమట, మూత్రం, శ్వాసించటం కారణంగా శరీరంలోని వాటర్ కంటెంట్ కోల్పావాల్సి వస్తుంది. కోల్పోయిన నీటిని తిరిగి భర్తీ కావాలంటే తగినన్ని నీటిని తాగటం మంచిది.