ఇన్‌స్టాగ్రామ్‌లో Text-only ఇమేజ్ పోస్టు ఎలా చేయాలంటే?

  • Published By: srihari ,Published On : June 20, 2020 / 11:21 AM IST
ఇన్‌స్టాగ్రామ్‌లో Text-only ఇమేజ్ పోస్టు ఎలా చేయాలంటే?

ఇతరుల ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలు లేదా పోస్ట్‌లలో మీరు ఎప్పుడైనా Text-only ఫొటోలను చూశారా? ఇంతకీ వాటిని వారు ఎలా తయారు చేశారో తెలుసా? ఆ ఫొటోలు థర్డ్ పార్టీ యాప్ ద్వారా చేసి ఉంటారా? అంటే సమాధానం.. Text-Only ఫొటోలు వాస్తవానికి బుల్ట్ ఇన్ మాత్రమ వీలుంటుంది. ఇన్‌స్టా ప్లాట్‌ఫారమ్‌లోని Create Mode ఫీచర్ ద్వారా ఇలా ఫొటోలను డిజైన్ చేసుకోవచ్చు. ఇంతకీ Text-Only ఇమేజ్ ఎలా పోస్టు చేయాలో తెలుసుకుందాం.. 

క్రియేట్ మోడ్ ద్వారా Text-Only ఫొటో పోస్టు ఎలా చేయాలి? :
1. మీ ఫోన్‌లో ఇన్‌స్టాగ్రామ్ యాప్‌ను ఓపెన్ చేయండి.
 2. Home Screen టాప్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్న కెమెరా ఐకాన్ Tap చేయండి.
insta
3. మీరు బాటమ్ టూల్ బార్ “Normal” నుంచి “Create” కనిపించే వరకు Slide చేయండి.
4. స్క్రీన్‌ను tap చేసి మీ టెక్స్ట్ యాడ్ చేయండి. అవసరమైతే, టాప్ మిడిల్ బటన్‌ను నొక్కడం ద్వారా మీరు వేర్వేరు ఫాంట్ ఎంపికలను ఎంచుకోవచ్చు. లేదా ఎడమ వైపున ఉన్న Slide bar ద్వారా Size మార్చవచ్చు. “Next” Click చేయండి.
instas
5. స్టోరీతో మీ Text ఇమేజ్‌ను సవరించుకోవచ్చు. రంగును కూడా మార్చుకోవచ్చు. కలర్ సర్కిల్ కోసం స్క్రీన్ టాప్ లెఫ్ట్ కార్నర్ లో Tap చేయండి. 
6. Text,  Image తో స్టోరీలను యాడ్ చేసి “Send” బటన్‌ను నొక్కండి. లేదా మీ ఫోన్ కెమెరా రోల్‌లో Save చేయడానికి స్క్రీన్ పైభాగంలో ఉన్న “Save” ఐకాన్ ఎంచుకోండి. మీరు ఫొటోను సేవ్ చేస్తే సరిపోతుంది.

Read: iPhone SE కంటే చౌకైన iPhone 12 అరచేతి సైజుతో వస్తోంది!