Apple ID పాస్‌వర్డ్‌ మర్చిపోవడం లేదా డివైజ్ కోల్పోతే ఎలా రీసెట్ చేయాలంటే?

  • Published By: srihari ,Published On : June 19, 2020 / 03:26 PM IST
Apple ID పాస్‌వర్డ్‌ మర్చిపోవడం లేదా డివైజ్  కోల్పోతే ఎలా రీసెట్ చేయాలంటే?

పాస్‌వర్డ్‌ను మర్చిపోయారా? లేదా మీ డివైజ్ కోల్పోయారా? ప్రత్యేకించి ఆపిల్ ఐడి వంటి అకౌంట్ పాస్‌వర్డ్ విషయంలో ఆపిల్ ID ఐ క్లౌడ్, డివైజ్‌లు యాక్సస్ ఇస్తుంది. ఆపిల్ డివైజ్‌ల్లో కనీసం ఒకదానికి యాక్సస్ ఉన్నవారికి, మీ ఆపిల్ ఐడిని రీసెట్ చేసే విధానం బ్రౌజర్‌లో చాలా ఈజీగా ఉంటుంది. మీ డివైజ్ లేకపోతే, మరో ఐఫోన్‌ను ద్వారా గుర్తించవచ్చు. యాప్ వంటి డివైజ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది. మీరు ఆపిల్ సపోర్ట్ యాప్ వేరొకరి పరికరంలో డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ప్రాసెస్ సమయంలో మీరు నమోదు చేసిన ఏదైనా సమాచారం డివైజ్‌లో స్టోర్ కాదు.

ఆపిల్ ఐడీ రీసెట్ చేయడానికి అనేక మార్గాలను అందిస్తుంది. ఆపిల్ ID వ్యక్తిగత పరికరాలు, వాటి ఆపరేటింగ్ సిస్టమ్‌లకు మీ యాక్సస్‌ను బట్టి పాస్‌వర్డ్ ఎంచుకోవచ్చు. బ్రౌజర్ ద్వారా మీ ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలంటే.. మీ ఆపిల్ డివైజ్‌ల్లో ఒకదానికి మీ ఆపిల్ ID ఇమెయిల్‌కు యాక్సస్ ఇవ్వాల్సి ఉంటుంది.

ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను వేరొకరి డివైజ్ నుంచి రీసెట్ చేయడానికి ఆపిల్ సపోర్ట్ యాప్ తప్పక ఉండాలి. iOS డౌన్‌లోడ్ చేయడానికి 13.1 లేదా అంతకంటే ఎక్కువ OS ఉండాలి. ఆపిల్ యూజర్లు తమ ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను ఫైండ్ మై ఉపయోగించి రీసెట్ చేయవచ్చు. ఐఫోన్ iOS 9 నుంచి iOS 12 ఆపరేటింగ్ సిస్టమ్‌లతో ఐఫోన్‌లు, ఐప్యాడ్‌లు లేదా ఐపాడ్ టచ్‌లపై యాప్ పనిచేస్తుంది.

మీ సొంత లేదా మరొకరి డివైజ్‌లో Finy My iphone యాప్‌తో మీ ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయొచ్చు.
1.Find My ఐఫోన్ App.. డౌన్‌లోడ్ చేసుకోండి, ఆపై దాన్ని మీ ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఐపాడ్ టచ్‌లో ఓపెన్ చేయండి.
2. సైన్-ఇన్ స్క్రీన్‌లో ఆపిల్ ఐడి ఫీల్డ్ ఖాళీగా లేకుంటే తొలగించండి.
3. మీరు స్ర్కీన్‌పై గుర్తు చూడకపోతే Sign Out ఆప్షన్ ఎంచుకోండి. ఆపై ఆపిల్ ఐడి ఫీల్డ్‌ను క్లియర్ చేయండి.
4. “Forgot Apple ID or Password” లింక్‌ను Tap చేయండి.
5. డివైజ్ పాస్‌కోడ్‌ను ఎంటర్ చేయండి.
6. మీ కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. ధృవీకరించడానికి మరోసారి ఎంటర్ చేయండి.
7. Change నిర్ధారించడానికి టాప్ రైట్ కార్నర్ లో “Next” ఎంచుకోండి.
8. “Next” ఎంచుకోండి. పాస్ వర్డ్ మార్పు నిర్ధారణను స్వీకరించడానికి Prompt ఫాలో అవ్వండి.

వేరొకరి ఐఫోన్ లేదా ఐప్యాడ్ ఉపయోగించి ఆపిల్ సపోర్ట్ యాప్‌తో మీ ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం ఎలానంటే? :
1. ఆపిల్ సపోర్ట్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
2. యాప్ తెరిచిన తర్వాత “Products” బటన్ నొక్కండి.
3. మీరు “ఆపిల్ ఐడి” చూసేవరకు క్రిందికి స్క్రోల్ చేసి దానిపై నొక్కండి.
4. “Forgot Apple ID Password” ఎంచుకోండి.
5. “Get Started” ఎంచుకోండి.
6. “వేరే ఆపిల్ ఐడి” లింక్‌ను Tap చేయండి.
7. మీరు పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలనుకుంటున్న ఆపిల్ ఐడిని ఎంటర్ చేయండి.
8. “Next” ఎంచుకోండి. పాస్ వర్డ్ మార్పు నిర్ధారణను స్వీకరించడానికి Prompt ఫాలో అవ్వండి.

ఆపిల్ డివైజ్‌లలో వెబ్ బ్రౌజర్‌లో ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను ఎలా రీసెట్ చేయాలంటే :
1. మీ ఆపిల్ ఐడి Pageకి వెళ్ళండి.
2. “Forgot Apple ID or password?” క్లిక్ చేయండి. లింక్.
3. మీ ఆపిల్ ఐడిని ఎంటర్ చేయండి.
4. మీ ఆపిల్ ఐడి అకౌంట్‌తో లింక్ అయిన ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేసి, ఆపై “Continue” Tap చేయండి.
5. ఆపిల్ మీ అన్ని రిజిస్టర్డ్ డివైజ్‌లకు డెస్క్‌టాప్ లేదా మొబైల్ నోటిఫికేషన్‌ను పంపుతుంది. మీ పాస్‌వర్డ్‌ను ఒకటి ద్వారా రీసెట్ చేయమని అడుగుతుంది.
6. డివైజ్‌లు ఉంటే, రీసెట్ కోసం మీ ఆపిల్ ఐడి పాస్‌వర్డ్‌ను మార్చమని మీరు ప్రాంప్ట్‌లను ఫాలో అవ్వొచ్చు.