Twitter Account Backup : ట్విట్టర్ నుంచి వెళ్లిపోతున్నారా? మీ డేటా జర భద్రం.. అకౌంట్లో ట్వీట్లు, ఫాలోవర్ల లిస్టును ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
Twitter Account Backup : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter) నుంచి నిష్క్రమిస్తున్నారా? మీ డేటా జర భద్రం.. మీ డేటాను కోల్పోకుండా ఉండాలంటే వెంటనే బ్యాకప్ తీసుకోవడం మంచిది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మీ అకౌంట్లో డేటాను Archive చేసేందుకు డౌన్లోడ్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది.

Twitter Account Backup : ప్రముఖ మైక్రోబ్లాగింగ్ వెబ్సైట్ ట్విట్టర్ (Twitter) నుంచి నిష్క్రమిస్తున్నారా? మీ డేటా జర భద్రం.. మీ డేటాను కోల్పోకుండా ఉండాలంటే వెంటనే బ్యాకప్ తీసుకోవడం మంచిది. మైక్రో బ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ మీ అకౌంట్లో డేటాను Archive చేసేందుకు డౌన్లోడ్ చేసుకోవడానికి యూజర్లను అనుమతిస్తుంది.
Twitter హెల్ప్ పేజీ ప్రకారం.. ప్లాట్‌ఫారమ్ మీ ప్రొఫైల్ డేటా, మీ ట్వీట్లు, మీ లైవ్ మెసేజ్‌లు మీ మూవెంట్స్, మీ మీడియా (ట్వీట్లు, డైరెక్ట్ మెసేజ్‌లు లేదా మూమెంట్లకు యాడ్ చేసిన ఫొటోలు, వీడియోలు, GIFలు వంటి వివరాలను డౌన్లోడ్ చేసుకునేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది).
మీ ఫాలోవర్ల లిస్టు, మీరు ఫాలో అయ్యే యూజర్ల లిస్టు, మీ అడ్రస్ బుక్, మీరు క్రియేట్ చేసిన సభ్యులు లేదా ఫాలో అయ్యే లిస్టులు, మీరు అకౌంట్లో పోస్టు చేసిన మొత్తం డేటాను సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. Twitter యూజర్లు HTML, JSON ఫైల్లలో మీ అకౌంట్లను ఇంటిగ్రేడ్ చేసిన డేటాను మెషిన్-రీడబుల్ ఆర్కైవ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ Twitter డేటాను ఎలా డౌన్లోడ్ చేయాలో ఇప్పుడు చూద్దాం.

How to download tweets, followers list and other data from your Twitter account
On Web :
* మీ కంప్యూటర్లో మీ ట్విట్టర్ అకౌంట్లో లాగిన్ చేయండి.
* మీ సిస్టమ్ స్ర్కీన్ ఎడమ వైపున ఉన్న ప్రధాన మెనుకి నావిగేట్ చేయండి. ‘More’ Tap చేయండి.
* ఇక్కడ Settings, Privacy ఎంచుకోండి
* ఇక్కడ, మీ అకౌంట్ ఎంచుకోండి.
* ఆ తర్వాత, మీ డేటా Archiveను DownLoad ఆప్షన్ ఎంచుకోండి.
* మీ పాస్‌వర్డ్‌ను నిర్ధారించి, ఆపై Request archive ఎంచుకోండి.

How to download tweets, followers list and other data from your Twitter account
On Smartphone :
* ఆండ్రాయిడ్, iOS డివైజ్‌ల కోసం దశలు ఒకే విధంగా ఉంటాయని గమనించండి.
* మీ స్మార్ట్‌ఫోన్‌లో ట్విట్టర్ యాప్‌ను ఓపెన్ చేయండి.
* మెయిన్ మెనూని యాక్సెస్ చేసేందుకు నావిగేషన్ Menu Iconపై Tap చేయండి.
* ఆ తర్వాత, సెట్టింగ్‌లు, Privacy ఆప్షన్‌పై Tap చేయండి.
* ఇక్కడ మీ అకౌంట్ ఎంచుకోండి
* మీ డేటా, అనుమతుల కింద మీ Twitter డేటాపై Tap చేయండి.
* మీ పాస్‌వర్డ్‌ను నిర్ధారించి, ఆపై Request Archive ఆప్షన్ Tap చేయండి.
ఆ తర్వాత, మీ Archive సిద్ధంగా ఉన్నప్పుడు Twitter మీకు ఈ-మెయిల్‌ను, యాప్‌లో నోటిఫికేషన్‌ను పంపుతుంది. ప్లాట్‌ఫారమ్ డేటాను షేర్ చేసేందుకు సాధారణంగా 24 గంటలు పడుతుంది. డౌన్‌లోడ్‌లో ‘Your archive’ అనే ఫైల్ ఉంటుంది, అది మీ డేటాను డెస్క్‌టాప్ వెబ్ బ్రౌజర్లో చూసేందుకు అనుమతిస్తుంది.
WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..