WhatsApp Tips : వాట్సాప్‌లో ఇతరుల మెసేజ్ వారికి తెలియకుండానే ఇలా సీక్రెట్‌గా చూడొచ్చు తెలుసా? ఇదిగో ట్రిక్!

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ దాదాపు 2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు.

WhatsApp Tips : వాట్సాప్‌లో ఇతరుల మెసేజ్ వారికి తెలియకుండానే ఇలా సీక్రెట్‌గా చూడొచ్చు తెలుసా? ఇదిగో ట్రిక్!

How to secretly view someone's WhatsApp Story without letting them know

WhatsApp Tips : ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (Whatsapp) యూజర్ల కోసం ఎప్పటికప్పుడూ సరికొత్త ఫీచర్లను ప్రవేశపెడుతోంది. వాట్సాప్ దాదాపు 2 బిలియన్ యాక్టివ్ యూజర్లు ఉన్నాయి. అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్‌లలో ఇదొకటిగా చెప్పవచ్చు. అయితే వాట్సాప్‌లో మీకు తెలియని సీక్రెట్స్ చాలానే ఉన్నాయి. వాట్సాప్ ద్వారా ఇతరుల చాట్ మెసేజ్ వారికి తెలియకుండానే చూడవచ్చు. అంటే.. వాట్సాప్ పంపినవారి మెసేజ్ మీరు చదివిన విషయం వారికి తెలియదని అర్థం. వాట్సాప్ టిప్స్ అండ్ ట్రిక్స్ తెలిస్తే.. చాలా విషయాలు తెలుసుకోవచ్చు.

మెటా యాజమాన్యంలోని యాప్ మెసేజింగ్ వాట్సాప్ భారీ యూజర్ బేస్‌కు కేటరింగ్, మెరుగైన యూజర్ ఎక్స్ పీరియన్స్ కోసం అనేక ఇతర ఫీచర్లను అందిస్తుంది. వాట్సాప్ అంటే కేవలం కాల్ చేయడానికి మాత్రమే కాదు.. గ్రూప్ కాలింగ్ (Group Calling), కమ్యూనిటీ ఫీచర్‌లు (Community Features), షేరింగ్ స్టేటస్ (Sharing Status) వంటి మరెన్నో ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. WhatsApp స్టేటస్ ఫీచర్ (Whatsapp Status Feature), Instagram, Facebook మాదిరిగానే పనిచేస్తుంది. వాట్సాప్‌లోనూ 24 గంటల తర్వాత అదృశ్యమయ్యే టెక్స్ట్, ఫోటో, వీడియో, GIF అప్‌డేట్‌లను షేర్ చేసేందుకు మిమ్మల్ని అనుమతిస్తుంది. అది కూడా ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ అయి ఉంటుంది.

How to secretly view someone's WhatsApp Story without letting them know

How to secretly view someone’s WhatsApp Story without letting them know

సాధారణంగా ఎవరైనా వాట్సాప్ స్టోరీని పోస్ట్ చేస్తే.. దాన్ని చూసిన యూజర్ పేరును పంపినవారు చూడగలరు. ఈ ఫీచర్ మీ డెయిలీ స్టేటస్ అప్‌డేట్‌లను చూస్తున్న యూజర్లందరికి కనిపిస్తుంది. కొన్నిసార్లు వాట్సాప్ అకౌంట్లో తరచుగా ఒకరి స్టోరీలను చెక్ చేసినప్పుడు హైడ్ చేయాలనుకుంటుంటారు. మీరు ఏదైనా స్టోరీని చూస్తే.. ఎవరూ చూశారో యూజర్ పేరును బట్టి తెలుసుకోవచ్చు. మీరు మరింత ప్రైవసీ కోరుకునేవారు అయితే.. మీకు వచ్చిన వాట్సాప్ మెసేజ్ వ్యూయర్ల లిస్టులో రాకుండా చూడవచ్చు. అలాంటి అద్భుతమైనే ఫీచర్ ఒకటి వాట్సాప్ కలిగి ఉంది. వాట్సాప్ స్టోరీలను అవతలి వ్యక్తికి తెలియకుండా మీరు చూసేందుకు సాధ్యమయ్యే అన్ని మార్గాలను ఓసారి చూద్దాం.

వాట్సాప్ Read-receipt ఆప్షన్ డిసేబుల్ చేయండి :
వాట్సాప్‌లో రీడ్-రిసిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ OFF చేయడం ద్వారా మీ చాట్‌లోని బ్లూ టిక్‌లు రాకుండా చేయవచ్చు. అప్పుడు మీరు వాట్సాప్ మెసేజ్ చూసిన విషయం ఇతరులకు తెలియకుండా ఉంటుంది. అయితే, రీడ్-రిసిప్ట్ ఆప్షన్ ఆఫ్ చేసిన తర్వాత మీరు మీ WhatsApp స్టేటస్ వ్యూలను కూడా చూడలేరని గమనించాలి.

Read-receipt ఎలా టర్న్ ఆఫ్ చేయాలంటే? :

* మీ స్మార్ట్‌ఫోన్‌లో WhatsApp ఓపెన్ చేయండి.
* టాప్ రైట్ కార్నర్‌లో త్రి డాట్స్ మెనుని Tap చేయండి.
* Settings ఎంచుకోండి.
* Account క్లిక్ చేసి Privacy ఎంచుకోండి.
* ఇప్పుడు Read-receipt కోసం Toggle నిలిపివేయండి.

View WhatsApp story offline :

WhatsAppని ఓపెన్ చేసి స్టోరీలను లోడ్ చేసేందుకు కొన్ని నిమిషాలు వేచి ఉండండి.
* ఇప్పుడు మీ ఫోన్‌లోని Wi-Fi లేదా మొబైల్ డేటా (Mobile Data)ను ఆఫ్ చేయండి.
* మీరు చూడాలనుకుంటున్న స్టోరీని ఓపెన్ చేయండి.

How to secretly view someone's WhatsApp Story without letting them know

How to secretly view someone’s WhatsApp Story without letting them know

Turn on incognito mode :
* మీరు WhatsApp డెస్క్‌టాప్‌ని ఉపయోగిస్తున్నారా?
* వెంటనే incognito mode మారండి. వెబ్ కోసం మీ WhatsAppని ఓపెన్ చేయండి.
* వాట్సాప్‌లోని స్టోరీలను అవతలి వ్యక్తికి తెలియకుండా చూడవచ్చు.

Open WhatsApp file in File Manager :

Android యూజర్ల కోసం WhatsApp స్టోరీలను చూసేందుకు మరో మార్గం ఉంది. మీరు WhatsApp ఫోల్డర్‌లో Save చేసిన మీ అన్ని WhatsApp మీడియాలను యాక్సెస్ చేయవచ్చు.

* Open File Manager > Internal Storage > WhatsApp > Media.
* ఇప్పుడు ‘Statuses’ పేరుతో ఉన్న ఫోల్డర్‌ను ఓపెన్ చేయండి.
* ఈ ఫోల్డర్‌లో, మీరు WhatsAppలో కాంటాక్టులు షేర్ చేసిన ఫొటోలు లేదా వీడియోలను చూడవచ్చు.

WATCH : 10TV LIVE : “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

Read Also : WhatsApp Photo Quality : వాట్సాప్‌లో ఇకపై బెస్ట్ క్వాలిటీ ఫొటోలను కూడా పంపుకోవచ్చు.. ఇలా ట్రై చేయండి..!