అఫీషియల్: హిందీలో ‘విక్రమ్ వేద’..

అఫీషియల్: హిందీలో ‘విక్రమ్ వేద’..

Hrithik Roshan – Saif Ali Khan:ఈ మధ్య సౌత్ స్టోరీల మీద ఎక్కువ కాన్సన్‌ట్రేట్ చేస్తున్న బాలీవుడ్ మరోసారి ఇక్కడి స్టోరీ మీద కన్నేసింది. తమిళ్‌లో సూపర్ హిట్ అయిన ఓ గ్యాంగ్‌స్టర్ డ్రామాని రీమేక్ చెయ్యాలని ప్లాన్ చేస్తోంది. అంతే కాదు.. ఈ సినిమా చెయ్యబోతున్న ఇద్దరు బాలీవుడ్ స్టార్స్‌ని కూడా అనౌన్స్ చేసింది.

‘విక్రమ్ వేద’ హిందీ రీమేక్‌లో ఆమీర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ నటించనున్నారు. ఒరిజినల్‌ను డైరెక్ట్ చేసిన గాయత్రి-పుష్కర్ ఈ సినిమా తెరకెక్కించనున్నారు. కట్ చేస్తే, ఇటీవలే ఆమీర్ ఖాన్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ నుంచి విత్‌డ్రా అయ్యారు. ఆమీర్ ఇలా డ్రాప్ అయ్యారో లేదో.. మరో స్టార్ హీరో హృతిక్ రోషన్ జాయిన్ అయ్యారు.

Vikram Vedha

ఈ యాక్షన్ డ్రామా ఎంటర్‌టైనర్‌లో రౌడీ షేడ్స్ ఉన్నవేద క్యారెక్టర్‌లో హృతిక్, పోలీస్ ఆఫీసర్ విక్రమ్ క్యారెక్టర్‌లో సైఫ్ అలీ ఖాన్ నటిస్తున్నారు. తమిళ్‌లో పెద్దగా ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ సక్సెస్ అయిన సినిమా ‘విక్రమ్ వేద’. గాయత్రి -పుష్కర్ డైరెక్షన్లో 2017 లో వచ్చిన ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ విక్రమ్‌గా మాధవన్, నెగెటివ్ రోల్‌లో వేదగా విజయ్ సేతుపతి అవుట్ అండ్ అవుట్ యాక్టింగ్ స్కిల్స్ చూపించి మెస్మరైజ్ చేశారు. ఇప్పుడు ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీని బాలీవుడ్ స్టార్ హీరోస్ రీమేక్ చేస్తున్నారు.

Vikram Vedha