Medaram Jatara : మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

నాలుగు రోజుల జాతరకు 1కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా. జాతర నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

Medaram Jatara : మేడారం జాతరకు పోటెత్తిన భక్తులు

Medaram

devotees to Medaram Jatara : మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. వేలాది వాహనాల్లో భక్త జనం మేడారంకు తరలివస్తున్నారు. మేడారం కుగ్రామం పూర్తిగా జానారణ్యంగా మారింది. జంపన్నవాగులో భక్తులు స్నానమాచరిస్తున్నారు. చుట్టూ పది కిలోమీటర్ల మేర గుడారాలు వేసుకొని వన దేవతల ఆగమనం కోసం భక్తులు ఎదురుచూస్తున్నారు. నాలుగు రోజుల జాతరకు 1కోటి 50 లక్షల మంది భక్తులు హాజరవుతారని అధికారులు అంచనా. జాతర నిర్వహణ కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ప్రత్యేక చర్యలు చేపట్టారు.

మేడారం జాతరకు 21లక్షల మంది భక్తులను తరలించడమే లక్ష్యంగా టీఎస్ ఆర్టీసీ పరుగులు పెడుతోంది. 3845 RTC బస్సులతో భక్తులను మేడారం జాతారకు తరలించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా 51 ప్రాంతాల్లో భక్తుల పికపింగ్ పాయింట్స్ ఏర్పాటు చేసింది. ఆన్ లైన్ లో బుక్ చేసుకున్న వారికి కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే మేడారం ప్రసాదం అందించనుంది. హెలికాప్టర్ ద్వారా మేడారంకు VIP భక్తులు చేరుకుంటున్నారు. హైదరాబాద్, హనుమకొండ, కరీంనగర్, మహబూబ్ నగర్ నుండి మేడారంకు హెలికాప్టర్ సర్వీస్ లు నడపనున్నారు.

Medaram Jatara : మేడారం జాతరకు అధికారిక సెలవులు

జాతర నిర్వహణకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. జాతర విధుల్లో 11వేల మంది పోలీసులు పాల్గొన్నారు. అడిషనల్ డీ.జీ, ఇద్దరు సీపీలు, 10మంది ఐపీఎస్ అధికారులు, 40మంది DSPలతో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. 380 సీసీ కెమేరాలతో జాతర పర్యవేక్షణ జరుగనుంది. మంత్రులు, ప్రజాప్రతినిధులు, VIPలు, VVIPల భద్రతకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పూర్తిగా వన్ వే ద్వారా వాహనాలను దారి మల్లించారు.

ప్రతి రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర ఉత్సవాలు .. ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 19 వరకు జాతర జరగనుంది. సమ్మక్క కూతురైన సారలమ్మ .. ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు గద్దెలపై కొలువుదీరనుంది. రేపు కుంకుమ భరిణె రూపంలో ఉండే సమ్మక్క తల్లిని గిరిజన పూజారులు వేడుకగా తీసుకువచ్చి ప్రతిష్టించనున్నారు. శుక్రవారం పెద్ద ఎత్తున జనం మొక్కులను తీర్చుకోనున్నారు. ఇక శనివారం సాయంత్రం దేవతలు వనప్రవేశం చేయడంతో జాతర ముగియనుంది.

Medaram Jatara : నేటి నుంచి మేడారం జాతర.. భక్తుల కోసం హెలికాప్టర్లు

మహాజాతరకు అన్ని ఏర్పాట్లు చేశామని మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఈసారి కోటిన్నర మంది భక్తులు వచ్చే అవకాశం ఉందన్నారు. అధికారుల సమన్వయంతో జాతర విజయవంతం అవుతుందని తెలిపారు. గత జాతరలతో పోల్చుకుంటే ఈసారి శాశ్వత నిర్మాణాలకు ప్రాధాన్యత ఇచ్చామని మంత్రి సత్యవతి రాథోడ్‌ పేర్కొన్నారు.

జాతరలో భక్తుల కోసం ప్రభుత్వం హెలికాప్టర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. హైదరాబాద్, కరీంనగర్‌, వరంగల్, మహబూబ్‌నగర్‌ జిల్లాల నుంచి ఈ సేవలు అందుబాటులో ఉండనున్నాయి. హైదరాబాద్‌, కరీంనగర్‌ నుంచి 75 వేల ప్యాకేజ్‌, వరంగల్‌ జిల్లా నుంచి 19 వేలు, మహబూబ్‌నగర్‌ జిల్లా నుంచి 85 నుంచి 90 వేల వరకు ప్యాకేజ్‌ ఉంటుందని మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ చెప్పారు.