Meat : హోలీ పండుగకు భార్య మాంసం వండలేదని 100కు ఫిర్యాదు.. సీన్ కట్ చేస్తే

హోలీ పండుగ సందర్భంగా ఫుల్ మద్యం సేవించాడు. ఇంటికి వచ్చి మాంసం తీసుకొచ్చి వంట చేయాలని హుకుం చేశాడు. దీనికి భార్య నిరాకరించింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది...

Meat : హోలీ పండుగకు భార్య మాంసం వండలేదని 100కు ఫిర్యాదు.. సీన్ కట్ చేస్తే

Meat

Kanagal : ఎవరికైనా ఆపద వచ్చిందంటే చాలు.. వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేస్తుంటారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకుని వారి సమస్యను తెలుసుకుని పరిష్కరిస్తుంటారు. కానీ.. ఈ మధ్యకాలంలో సమస్యలు ఉన్న వారి కంటే…సమస్యలు లేని వారు ఎక్కువగా ఫోన్ చేస్తున్నారనే విషయం ఇటీవలే వెల్లడైన సంగతి తెలిసిందే. డైల్ 100కి ఫోన్ చేసి టైం పాస్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనే ఒకటి చోటు చేసుకుంది. డయల్ 100కి నెంబర్ కు వచ్చిన ఫోన్ కాల్ రిసీవ్ చేసుకున్న పోలీసులు.. ఆ వ్యక్తి చెప్పిన ప్రాంతానికి వెళ్లారు. అతను చెప్పిన కారణానికి షాక్ తినాల్సి వచ్చింది పోలీసులకు. తమ టైంను వేస్ట్ చేసినందుకు ఆ వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికంతటికి కారణం.. అతను మద్యం మత్తులో ఉండడమే.

Read More : Age Relaxation : 34 కాదు 44.. నిరుద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్

హోలీ పండుగను దేశ వ్యాప్తంగా ఘనంగా జరుకున్నారు. కనగల్ ప్రాంతంలో చర్లగౌరానికి నవీన్ కుటుంబసభ్యులతో నివాసం ఉంటున్నాడు. హోలీ పండుగ సందర్భంగా ఫుల్ మద్యం సేవించాడు. ఇంటికి వచ్చి మాంసం తీసుకొచ్చి వంట చేయాలని హుకుం  చేశాడు. దీనికి భార్య నిరాకరించింది. ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న నవీన్ వెంటనే 100 నెంబర్ కు ఫోన్ చేశాడు. ఒకసారి కాదు.. రెండు సార్లు కాదు.. ఏకంగా ఆరు సార్లు చేయడంతో ఫోన్ రిసీవ్ చేసుకున్న పోలీసులు అతని ఇంటికి వచ్చారు. అసలు సమస్య ఏంటీ అనే దానిపై ఆరా తీశారు. తన భార్య మాంసం వండలేదని.. ఆమెపై చర్యలు తీసుకోవాలని మద్యం మత్తులో జోగుతున్న నవీన్ చెప్పడంతో పోలీసులకు తీవ్ర ఆగ్రహం కల్పించింది. తమ సమయాన్ని వృథా చేసినందుకు నవీన్ పై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్ఐ నగేశ్ వెల్లడించారు. అత్యవసర సేవలు, ఆపద సమయంలో 100 నెంబర్ కు ఫోన్ చేయాలని సూచించారు. అనవసరంగా ఫోన్ చేస్తూ.. సమయాన్ని వృథా చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.