Sakireddy Varshini : హమ్మయ్య.. వర్షిణి సేఫ్.. ముంబైలో ప్రత్యక్షం.. షాక్‌లో పోలీసులు

మేడ్చల్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. హైదరాబాద్ లో అదృశ్యం అయిన సాకిరెడ్డి వర్షిణి ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. ఆమె ముంబై ఎందుకు వెళ్లిందో తెలిసి పోలీసులు షాక్ తిన్నారు.

Sakireddy Varshini : హమ్మయ్య.. వర్షిణి సేఫ్.. ముంబైలో ప్రత్యక్షం.. షాక్‌లో పోలీసులు

Sakireddy Varshini

Sakireddy Varshini : మేడ్చల్ పరిధిలో ఇంజినీరింగ్ విద్యార్థిని మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. హైదరాబాద్ లో అదృశ్యం అయిన సాకిరెడ్డి వర్షిణి ముంబైలో ప్రత్యక్షం అయ్యింది. వర్షిణిని ముంబైలో ట్రేస్ చేసిన పోలీసులు స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించారు. విచారణలో వర్షిణి చెప్పిన విషయాలు పోలీసులు షాక్ అయ్యారు. డిప్రెషన్ వల్లే ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్లు వర్షిణి చెప్పింది.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మిడ్ ఎగ్జామ్ రాయడానికి సీఎంఆర్ కాలేజీకి వెళ్లిన వర్షిణి తిరిగి ఇంటికి రాలేదు. వర్షిణి బంధువు మోహన్ రెడ్డి స్వయంగా ఆమెను కాలేజీ దగ్గర డ్రాప్ చేశారు. కాలేజీ లోపలికి వెళ్లిన వర్షిణి ఐడీ కార్డు, సెల్ ఫోన్ మర్చిపోవడంతో వాటిని తెచ్చుకునేందుకు మళ్లీ బయటకు వచ్చింది. ఈ దృశ్యాలన్నీ సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఎగ్జామ్ అయిన తర్వాత వర్షిణి ఇంటికి తిరిగి రాలేదు. సాయంత్రం వరకు ఎదురుచూసిన కుటుంబసభ్యులు ఆందోళనకు గురయ్యారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Rachakonda : మల్కాజ్‌గిరి సీసీఎస్ ఎస్ఐ పై రేప్ కేస్… సస్పెండ్ చేసిన సీపీ

వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. వర్షిణి సోషల్ మీడియా అకౌంట్స్ ను పరిశీలించారు. ముంబైలో ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ యాక్సెస్ చేసినట్టు గుర్తించారు. మేడ్చల్ అమ్మాయికి ముంబైతో లింక్ ఏంటి? వర్షిణి తనకు తానుగా ముంబై వెళ్లిందా? లేక ఎవరైనా బలవంతంగా తీసుకెళ్లారా? అన్న కోణంలో పోలీసులు దర్యాఫ్తు చేశారు. చివరికి వర్షిణిని ముంబైలో గుర్తించి.. ముంబై పోలీసులను అలర్ట్ చేశారు. కల్యాణ్ ప్రాంత పోలీసులు వర్షిణిని గుర్తించి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

CI Nageswara Rao : వివాహితపై అత్యాచారం కేసు.. కీచక ఖాకీపై సస్పెన్షన్ వేటు

మేడ్చల్ జిల్లా కండక్లోయలోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో వర్షిణి బీటెక్ చదువుతోంది. పరీక్ష రాసేందుకు కాలేజీకి వెళ్లి ఇంటికి తిరిగి రాకపోవడం కలకలం రేపింది. ఈ నెల 7న కాలేజీకి వెళ్లిన వర్షిణి.. ఐడీ కార్డు, మొబైల్ ఫోన్ మర్చిపోయాయని చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చింది. కానీ ఇంటికి తిరిగి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వర్షిణిని ట్రేస్ చేశారు. వర్షిణిని ముంబై నుంచి హైదరాబాద్ కు తీసుకొచ్చేందుకు పోలీసులు ఏర్పాట్లు చేశారు. వర్షిణి మిస్సింగ్ కేసు సుఖాంతం కావడం, సేఫ్ గా ఉండటంతో తల్లిదండ్రులతో పాటు పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు.