Hyderabad వాసులకు గుడ్ న్యూస్..త్వరలో Metro పరుగులు!

  • Published By: madhu ,Published On : May 12, 2020 / 10:05 AM IST
Hyderabad వాసులకు గుడ్ న్యూస్..త్వరలో Metro పరుగులు!

లాక్‌డౌన్‌తో నిలిచిపోయిన హైదరాబాద్ మెట్రో మరికోద్ది రోజుల్లో పట్టాలెక్కేందుకు రెడీ అవుతోందా? ప్రభుత్వ ఆదేశాలకోసం మెట్రో వర్గాలు వెయిట్ చేస్తున్నాయా? త్వరలో ప్రజా రవాణా అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అందుకు మెట్రో వర్గాలు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బట్‌ కండీషన్స్‌ అప్లై అంటున్నారు అధికారులు. 

లాక్ డౌన్ మెట్రో సర్వీసులు ననిలిచిపోయాయి. 2020, మే 15వ తేదీ తరువాత ఆర్టీసీ బస్సులు నడపడంపై ఒక నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వ వర్గాలు ప్రకటించిన నేపథ్యంలో హైదరాబాద్ మెట్రో కూడా ఓపెన్ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. మొత్తం 57 ట్రైన్స్‌ హైదరాబాద్ మెట్రోకు ఉన్నాయి.

అయితే మూడు మార్గాల్లో రెగ్యులర్ గా ట్రాక్ చెకింగ్…సిగ్నలింగ్ వ్యవస్థను పరిశీలిస్తున్నారు అధికారులు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నారు. మూడు మార్గాల్లో 6 రైళ్లను కూడా ఎమర్జెన్సీ సర్వీసులకోసం అందుబాటులో ఉంచారు. 

మెట్రోలో ప్రయాణించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. కరోనా ఎఫెక్ట్‌తో ప్యాసింజర్స్‌ తప్పనిసరిగా భౌతిక దూరం పాటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు ప్రధానంగా సిట్టింగ్ అరేంజ్‌మెంట్స్ వద్ద మార్కింగ్ చేసి మీటర్ వరకు దూరం ఉండేలా చూడనున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గతంలోఉన్న రద్దీ మెట్రోలో కొన్ని నెలలపాటు కనిపించకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది. 

ప్యాసింజర్స్‌ తప్పని సరిగా మాస్క్ ధరించాల్సి ఉంటుంది. రైళ్లలోని ఖాళీలను బట్టి టికెట్ కొనుగోలు చేసిన వారు ప్లాట్ ఫాం మీదకు వెళ్లాల్సి ఉంటుంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో బోగీల సంఖ్యను మూడు నుంచి ఆరు బోగీలకు  పెంచుతారా లేక రైళ్ల ప్రిక్వేన్సీని పెంచుతారా అనేది మరికోద్ది రోజుల్లో తేలనుంది. మెట్రో సర్వీసులు తిరిగి ప్రారంభం కావాలంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల కోసం వెయిట్ చేస్తున్నాయి హైదరాబాద్ మెట్రో వర్గాలు. 

Read More :

తెలంగాణలో రోడ్డెక్కనున్న ఆర్టీసీ బస్సులు.. ప్రయాణికులకు కొత్త నిబంధనలు

జూన్‌ తొలివారంలో రైళ్ల కూత.. ఆర్టీసీ బస్సులు నడిచేనా?