త్వరలోనే హైదరాబాద్ లో Metro పరుగులు

  • Published By: madhu ,Published On : June 3, 2020 / 01:58 AM IST
త్వరలోనే హైదరాబాద్ లో Metro పరుగులు

కరోనా వైరస్ కాలంగా 60 రోజులకు పైగా పట్టాలెక్కని మెట్రో రైలు మళ్లీ కూతపెట్టనుంది. త్వరలోనే పరుగులు తీయనున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్ డౌన్ నిబంధనలకు క్రమ క్రమంగా సడలింపులు ఇస్తున్న సంగతి తెలిసిందే. తెలంగాణ రాష్ట్రంలో రవాణాకు సంబంధించిన విషయంలో కీలక నిర్ణయాలు తీసుకొంటోంది ప్రభుత్వం. ఇప్పటికే ఆర్టీసీ (జిల్లాలకు) సర్వీసులు ప్రారంభమైన సంగతి తెలిసిందే.

కానీ. గ్రేటర్ హైదరాబాద్ లో మాత్రం బస్సులకు నో చెప్పారు. మెట్రోకు కూడా అనుమతినివ్వలేదు. ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా ఉప్పల్, మియాపూర్ మెట్రో డిపోలకే పరిమితం అయిన..రైళ్లకు రోజువారీగా స్పీడ్, లోడ్, ఇతర నిర్వాహణ సామర్థ్యపరమైన మరమ్మత్తులు, పరీక్షలు నిర్వహిస్తున్నట్లు మెట్రో వర్గాలు వెల్లడించాయి. 2020, జూన్ మూడో వారంలో మెట్రోకు అనుమతినిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎల్బీనగర్ – మియాపూర్, జేబీఎస్ – ఎంజీబీఎస్, నాగోల్ – రాయదుర్గం రూట్లలో 69 కిలోమీటర్ల మేర మెట్రో రైలు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ఉండడంతో భౌతిక దూరం ఖచ్చితంగా అమలు చేయాలని మెట్రో వర్గాలు భావిస్తున్నాయి. 50 నుంచి 60 శాతం ప్రయాణీకులతో రాకపోకలు సాగించే ఛాన్స్ ఉంది. ఒక్కో రైలులో 500 నుంచి 600 మందికి మాత్రమే అనుమతినిస్తారు. బోగిల్లో భౌతిక దూరం పాటించే విధంగా తెల్లటి రౌండ్ సర్కిల్స్ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. 

ఇక మెట్రో స్టేషన్ లో ఉండే ఎస్కలేటర్లు, లిఫ్టుల బట్లను చేతితో తాకే అవసరం లేకుండా చేయాలని, కాలివేళ్లతో టచ్ చేస్తే..పనిచేసే ఆధునిక టెక్నాలజీని వినియోగించాలని భావిస్తున్నారు. ఇప్పటికే చెన్నైలో ఈ ఆధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ప్రయాణీకులు పట్టుకుని నిల్చునే హ్యాండిల్స్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయనున్నారు. ప్రయాణికులకు శానిటైజర్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కోసం మెట్రో ఎదురు చూస్తోంది. మరి మెట్రో ఎప్పుడు పరుగులు తీయనుందో చూడాలి మరి. 

Read: కరోనా ఉంది : వేడుకలు వద్దు..అభిమానులకు మంత్రి హరీష్ విజ్ఞప్తి