కరోనా భయం : చలో పల్లె టూరు అంటున్న జనాలు

  • Published By: madhu ,Published On : July 2, 2020 / 07:14 AM IST
కరోనా భయం : చలో పల్లె టూరు అంటున్న జనాలు

తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయ హైదరాబాద్. ఇక్కడ ఎంతో మంది నివసిస్తుంటారు. అయితే..ప్రస్తుతం కొంతమంది చలో పల్లెటూరు అంటున్నారు. ఇప్పుడసలు పండుగలు ఏమీ లేదు కదా…ఎందుకు వెళుతున్నారు ? అనుకుంటున్నారు ? కదా ? కరోనా ఫీవర్ తో జనాలు భయపడిపోతున్నారు.

బతుకుంటే..బలిసాకు తినొచ్చు..అని..ఇళ్ళకు తాళాలు వేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. హైదరాబాద్ లో కరోనా కేసులు ఎక్కువవుతుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. హైదరాబాద్ లో రానున్న రెండు, మూడు రోజుల్లో లాక్ డౌన్ విధిస్తారని ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో ఇక్కడ కంటే..సొంతూళ్లే నయనమని భావిస్తున్నారు.

దీంతో టోల్ ప్లాజాల వద్ద రద్దీ క్రమక్రమంగా పెరిగిపోతోంది. విజయవాడ హైవేతో పాటు వరంగల్, జహీరాబాద్, హన్మకొండ, వికారాబాద్, చేవెళ్ల, మెదక్, సంగారెడ్డి ఇతర ప్రాంతాల్లో ఇదే సీన్ కనిపిస్తోంది. ఆర్టీసీ బస్సులు, రైళ్లు కిటకిటలాడుతున్నాయి. రెండు రోజులుగా వీటికి డిమాండ్ పెరిగిందని అధికారులు అంటున్నారు.

ఇదిలా ఉంటే…లాక్ డౌన విధిస్తారనే ప్రచారం జరుగుతుండడంతో…జనాలు నిత్యావసర సరుకులు కొనుక్కొనేందుకు పరుగులు పెడుతున్నారు. సూపర్‌మార్కెట్లు, షాపింగ్‌ కేంద్రాలు, కిరాణా దుకాణాల వద్ద జనాలు బారులు తీరుతున్నారు. కాలానికి సరిపడా సరుకులు కొని పెట్టుకోవాలనే ఆత్రుతతో దుకాణాల వద్ద క్యూ కడుతున్నారు. ఇక వైన్ షాపుల వద్ద పరిస్థితి చెప్పనవసరం లేదు.

Read:రాత్రి 9.30 గంటల వరకు వైన్ షాపులకు పర్మిషన్