ఇక ఇంట్లోనే కరోనా చికిత్స, హైదరాబాద్ లో హోం క్వారంటైన్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల శ్రీకారం, చికిత్స ఖరీదు రూ.19వేల 500

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రులకూ ప్రభుత్వం

ఇక ఇంట్లోనే కరోనా చికిత్స, హైదరాబాద్ లో హోం క్వారంటైన్‌కు ప్రైవేట్‌ ఆస్పత్రుల శ్రీకారం, చికిత్స ఖరీదు రూ.19వేల 500

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రులకూ ప్రభుత్వం

తెలంగాణలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతుండడంతో చికిత్సకు ప్రైవేట్‌ ఆస్పత్రులకూ ప్రభుత్వం అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సెంటర్లు నిండుతుండడంతో సరికొత్త విధానానికి రెడీ అయ్యాయి. పలు కార్పొరేట్‌ ఆస్పత్రులు కరోనా బాధితుల కోసం హోమ్‌ క్వారంటైన్ చికిత్సకు శ్రీకారం చుట్టబోతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే హోమ్‌ క్వారంటైన్‌ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో కరోనా టెస్టులు, వైద్యానికి అనుమతి:
లాక్‌డౌన్‌ సడలింపుల తర్వాత అటు దేశంలో… ఇటు రాష్ట్రాల్లో కరోనా బాధితులు పెరుగుతున్నారు. తెలంగాణలోనూ కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు. అయినా ప్రభుత్వం మాత్రం కరోనా బాధితులకు చికిత్స అందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయడం లేదు. ఒకవైపు కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే మరోవైపు విస్తృత కరోనా పరీక్షలు చేయిస్తోంది. దీంతో జీహెచ్‌ఎంసీ దాని చుట్టూ ఉన్న జిల్లాల్లో కేసులు భారీ సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి. ఇంకా కరోనా నిర్ధారణ పరీక్షలు పెంచాలని భావించిన ప్రభుత్వం… ప్రైవేట్‌, కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ టెస్ట్‌లకు పర్మిషన్‌ ఇచ్చింది. అంతేకాదు.. కరోనా చికిత్సకూ అనుమతిచ్చింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు.. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు, సేవా దృక్పథంతో కరోనా వ్యాధి గ్రస్తులకు, అత్యవసర చికిత్స అందిస్తున్నాయి. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం కరోనా పరీక్షలూ నిర్వహిస్తున్నాయి.

15రోజుల పాటు హోమ్‌ క్వారంటైన్‌, ధర రూ. 19,500:
కరోనా వ్యాధి లక్షణాలు ఉన్న వారికి ఇంట్లోనే చికిత్స చేసుకునేలా.. కొన్ని కార్పొరేట్‌ ఆస్పత్రులు హోమ్‌ క్వారంటైన్‌ విధానానికి శ్రీకారం చుట్టాయి. ఈ హోమ్‌ క్వారంటైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ విధానంలో 15 రోజుల క్వారంటైన్‌ పీరియడ్  కేవలం 19,500 చార్జ్‌ చేయాలని నిర్ణయించాయి. ఈ 15 రోజుల సమయంలో కరోనా లక్షణాలు ఉన్న రోగికి నేరుగా ఆస్పత్రిలో చికిత్స అందించినట్టుగానే… హోమ్‌ క్వారంటైన్‌లో ఉన్నవారికీ అందించనున్నారు. ప్రతిరోజు హెల్త్‌పై వైద్యులు మానిటరింగ్‌ చేస్తారు. డాక్టర్లతో వీడియో కన్సల్టెన్సీ సౌకర్యం కల్పిస్తారు. ఫిజిషియన్‌తో కరోనా బాధితులపై ప్రత్యేక దృష్టి సారిస్తారు. కోవిడ్‌ లక్షణాలు ఉన్న రోగికి బ్రీతింగ్‌ సమస్యను అధిగమించేందుకు ప్రొఫెషనల్‌ ఫిజిషియన్‌ థెరపీలతో వీడియో కన్సల్టెన్సీ చేయిస్తారు. ఇక కరోనా రోగికి ఎన్‌-95 మాస్క్‌లు, సురక్షితమైన పీపీఈ కిట్లు , గ్లౌజులు అందజేస్తారు.

ముందుగా యశోదాలో.. ఆ తర్వాత అపోలో, సన్‌షైన్‌, కేర్‌ ఆస్పత్రుల్లో హోమ్‌ క్వారంటైన్‌:
ప్రముఖ కార్పొరేట్ ఆసుపత్రిలో యశోదాలో తొలిసారి హోమ్‌ క్వారంటైన్‌ విధానాన్ని అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఇప్పటికే సాంకేతికంగా సమస్యను అధిగమించి మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి తేబోతున్నారు. యశోదాతోపాటు… హైదరాబాద్‌ నగరంలోని అపోలో.. సన్‌షైన్‌, కేర్‌లాంటి ఆస్పత్రులు సైతం.. కరోనా హోమ్‌క్వారంటైన్‌ సెంటర్లను అందుబాటులోకి తీసుకురాబోతున్నాయి.

Read: 30కోట్ల మొక్కలు లక్ష్యం, తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా 6వ విడత హరితహారం