హైదరాబాద్ నుంచి అమెరికాకు నాన్ స్టాప్ ఫ్లైట్

  • Published By: venkaiahnaidu ,Published On : December 9, 2020 / 06:44 PM IST
హైదరాబాద్ నుంచి అమెరికాకు నాన్ స్టాప్ ఫ్లైట్

Hyderabad to have non-stop flight to the US జనవరి-15నుంచి హైదరాబాద్ నుంచి అమెరికాకు డెరెక్ట్ ఫైట్ సర్వీసు అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ నుంచి చికాగో వరకు నాన్ ఎయిర్ ఇండియా ఫైట్ సర్వీసు జనవరి-15నుంచి అందుబాటులోకి రానుంది. బోయింగ్ 777-200 విమానాన్ని ఈ సర్వీసు కోసం ఉపయోగించనుంది ఎయిర్ ఇండియా.



ఈ విమానం 238(8ఫస్ట్ క్లాస్+35బిజినెస్ క్లాస్+195ఎకానమీ క్లాస్)సీటింగ్ సామర్థ్యంతో ఉంటుంది. ఏటా 2.2లక్షలకు మందికిపైగా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచి అమెరికాకి వెళ్లే వారికి సేవలందించేందుకు ఈ విమానాన్ని అందుబాటులోకి తీసుకొస్తున్నారు. హైదరాబాద్ మరియు చికాగోలను కలిపే కొత్త నాన్-స్టాప్ మార్గం..ఎయిర్ పోర్ట్స్ కనెక్టివిటీ విష్ లిస్ట్ లో కొంతకాలంగా ఉందని హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లిమిటెడ్ సీఈవో ప్రదీప్ పానికర్ తెలిపారు.



అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఆపిల్ మరియు గూగుల్ వంటి అమెరికా దిగ్గజాలకు హైదరాబాద్ రెండవ నివాసంగా ఉన్న నేపథ్యంలో ఈ విమానానికి అపారమైన సామర్థ్యం ఉందని అధికారులు తెలిపారు. అదేవిధంగా ఇది తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు చెందిన తెలుగు ప్రవాసులకు కూడా పెద్ద ఉపశమనం కలిగించనుందని తెలిపారు.



కాగా, ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ బబుల్ ఒప్పందం కింద… బ్రిటిష్ ఎయిర్ వేస్ వంటి విమానయాన సంస్థలు కూడా హైదరాబాద్-బ్రిటన్ ని కలిపే కార్యకలాపాలను తిరిగి ప్రారంభించగా, ఎమిరేట్స్, ఎతిహాద్, ఫ్లై దుబాయ్ మరియు ఎయిర్ అరేబియా లు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లోని వివిధ గమ్యస్థానాలతో హైదరాబాద్ ని కలుపుతూ తమ సేవలను తిరిగి ప్రారంభించాయి. ఖతార్ ఎయిర్‌వేస్ కూడా హైదరాబాద్‌ను దోహాతో తిరిగి కనెక్ట్ చేసింది.