Hyderabad Traffic Rules Strict : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం కానున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరించారు.

Hyderabad Traffic Rules Strict : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం.. ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు

Hyderabad Traffic rules strict

Hyderabad Traffic Rules Strict : హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ రూల్స్‌ మరింత కఠినతరం కానున్నాయి. నగరంలో ట్రాఫిక్‌ రూల్స్‌ను మరింత కఠినంగా అమలు చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇందులో భాగంగా నేటి నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు. ట్రాఫిక్‌ నియమాలను ఉల్లంఘిస్తే భారీ జరిమానాలు తప్పవని అధికారులు హెచ్చరించారు. రాంగ్‌సైడ్‌ డ్రైవింగ్‌, ట్రిపుల్‌ రైడింగ్‌ చేస్తే పెద్ద మొత్తం జరిమానాలు విధించనున్నారు.

ఇటీవల హైదరాబాద్ లో జరిగిన రోడ్డు ప్రమాదాలపై ట్రాఫిక్‌ పోలీసులు అధ్యయనం చేయగా.. ఈ రెండు ఉల్లంఘనల వల్లే అధికంగా ప్రమాదాలు జరుగుతున్నట్లు గుర్తించారు. దీంతో ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న వాహనదారులతో పాటు పాదచారులు కూడా ప్రమాదాలకు గురవుతున్నట్లు వెల్లడైంది. ఈ నేపథ్యంలో వారం రోజులుగా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలపై అవగాహన కల్పించిన ట్రాఫిక్‌ పోలీసులు.. సోమవారం నుంచి స్పెషల్‌ డ్రైవ్‌ నిర్వహిస్తున్నారు.

Traffic Rules:కొత్త ట్రాఫిక్ రూల్స్ : 5 ఏళ్లు దాటిన చిన్నారులకూ హెల్మెట్ తప్పనిసరి

రాంగ్‌ రూట్‌లో వచ్చే వాహనాలకు రూ.1700, ట్రిపుల్‌ రైడింగ్‌కు రూ.1200 వరకు జరిమానా విధించనున్నారు. ఇక జీబ్రా లైన్‌ దాటితే రూ.100, ఫ్రీ లెఫ్ట్‌కు అడ్డుపడితే రూ.1000 జరిమానా విధించనున్నారు. కాగా, ద్విచక్ర వాహనాలు, ఆటోలతో ప్రమాదాలుగా తక్కువగా ఉన్న నేపథ్యంలో.. వాటిపై విధించే జరిమానాలు కూడా తక్కువగానే ఉంటాయని అధికారులు తెలిపారు. భారీ వాహనాలు రాంగ్‌రూట్‌లో రావడంతో నష్టం కూడా అదే స్థాయిలో ఉంటుందని స్పష్టం చేశారు.

ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని బైక్‌లు, ఆటోలకు విధించే జరిమానాలతో పోలిస్తే.. భారీ వాహనాలకు విధించే జరిమానాలు ఎక్కువేనని తెలిపారు. మధ్య తరగతి ప్రజలు నడిపించే వాహనాలైన బైక్‌లు, ఆటోలపై విధించే జరిమానాలు గతంతో పోలిస్తే తక్కువగానే ఉన్నాయని పేర్కొన్నారు. ట్రాఫిక్‌ నియమాల ఉల్లంఘనలకు పాల్పడకుండా ట్రాఫిక్‌ నిబంధనలు పాటించాలని, ప్రమాదాలు తగ్గించాలని అధికారులు కోరుతున్నారు.