నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే పిల్ల నాదిరా..ఇన్ స్టాలో మెసేజ్..ఖంగుతిన్న వరుడు

నువ్వు పెళ్లి చేసుకోవాలనుకునే పిల్ల నాదిరా..ఇన్ స్టాలో మెసేజ్..ఖంగుతిన్న వరుడు

Hyderabad Young Man Cancelled Marriage With Social Media Message (1)

young man cancelled marriage : పెళ్లి కుదిరిన యువకుడు ఉత్సాహంగా పెళ్లి పనులు చేసుకుంటున్నాడు. పెళ్లి బట్టలు కొన్నాడు. ఫ్రెండ్స్ అందరికీ చెప్పుకున్నాడు. ఫోటో షూట్ లు వెరైటీగా ఉండాలని మంచి మంచి ప్లాన్స్ వేసుకున్నాడు. మరికొన్ని రోజుల్లో తను ఒక ఇంటివాడు అవుతున్నాడని..కాబోయే భార్య గురించి కలలు కంటున్నాడు. ఇంతో అతని ఇన్ స్టాగ్రామ్ కు ఓ మెసేజ్ వచ్చింది. ‘‘ఓ బ్రదరూ..నువ్వు పెళ్లి చేసుకోబోయే పిల్ల నాది…నేను ప్రేమించాననీ..ఆ పిల్ల నాది‘‘అంటూ మెసేజ్ వచ్చింది..ఈరోజుల్లో ఇటువంటి పిచ్చి మెసేజ్ లు కామనే అనుకున్నాడు. కానీ అదే మెసెజ్ పదే పదే వస్తుంటే అనుమానించాడు. ఏం చేయాలో తెలీయలేదు..దీంతో ఓ నిర్ణయం తీసుకున్నాడా యువకుడు..మరి ఏంటా నిర్ణయం..?!

తెలంగాణాలోని నిజామాబాద్ కు చెందిన వివేక్ అనే 24 ఏళ్ల యవకుడి కుటుంబం హైదరాబాద్ లోని బేగం బజార్ లో స్థిరపడింది. వివేక్ కు మల్కాజిగిరి సఫిల్ గూడలో ఉండే దగ్గర బంధువుల అమ్మాయిని ప్రేమించాడు. ఈ క్రమంలో సదరు యువతి తల్లిదండ్రులు బేగం బజార్ కు చెందిన ఓ యువకుడితో పెళ్లి కుదిర్చారు. పెళ్లి ముహూర్తం కూడా పెట్టారు.మరో రెండు నెలల్లో పెళ్లి. ఇరు కుటుంబాలవారు పెళ్లికి కావాల్సిన పనులు చేసుకుంటున్నారు. పెళ్లికార్డులు, పెళ్లి బట్టలు, ఫోటో గ్రాఫర్, పెళ్లి విందులో ఎటువంటి వంటకాలు వండాలి? ఎలాంటి స్వీట్లు పెట్టాలి? వంటి ఎన్నోపనులతో హడావిడిగా ఉన్నారు.

ఈక్రమంలో కాబోయే వధువుతో పెళ్లి నిశ్చయం అయిన యువకుడికి ఇన్ స్టాగ్రాంలో వివేక్ ఓ మెసేజ్ పంపాడు. ‘‘నువ్వు పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి నాది. ఆమెను గాఢంగా ప్రేమించాను. ఆమెనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. నన్ను కాదని నువ్వు ఆమెను పెళ్లి చేసుకుంటే చంపేస్తా..వెంటనే ఈ పెళ్లిని క్యాన్సిల్ చేసుకో‘ అంటూ మెసేజ్ పంపాడు.

దీన్ని చూసిన ఆ యువకుడు ఖంగుతిన్నాడు. ఈరోజుల్లో ఇటువంటి ఫేక్ మెసేజ్ లు కామనే అనుకున్నాడు. దాన్ని పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాడు. తన పని తాను చూసుకుంటున్నాడు. కానీ పదే పదే అవే మెసేజ్ లు వస్తుండటంతో ఈ విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. వాళ్లు అది విని ఆశ్చర్యపోయారు. పెళ్లి అని అందరికీ చెప్పుకున్నాం. ఇప్పుడిదేంటీ? అంటూ ఏం చేయాలో తెలియక అయోమయంలో పడిపోయారు.

ఆ అమ్మాయి గురించి తెలుసుకోకుండానే ఆమె తల్లిదండ్రుల వద్దకు వెళ్లి విషయం చెప్పారు. పెళ్లిని క్యాన్సిల్ చేసుకున్నారు. కుమార్తె పెళ్లి రద్దు కావడానికి బంధువుల కుమారుడైన వివేకే కారణమని తెలిసి వాళ్లు ఆశ్చర్యపోయారు. ఈ విషయమై ఆ యువతిని తల్లిదండ్రులు నిలదీశారు.దానికి ఆమె తనకు ఏమీ తెలియదనీ..అతడిని నేను ప్రేమించడం లేదని వాపోయింది. అదే విషయాన్ని వరుడికి..అతని కుటుంబానికి చెప్పినా..ఫలితం లేకపోయింది.

దీంతో యువతి తల్లిదండ్రులు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. నువ్వు ప్రేమించిన విషయం ఆ అమ్మాయికి చెప్పావా? అని వివేక్ ను పోలీసులు అడిగితే.. లేదని సమాధానం ఇచ్చాడు..‘నాది వన్ సైడ్ లవ్వు..కానీ..ఆ అమ్మాయికి ప్రపోజ్ చేద్దామనుకున్నాను. కానీ ఇంతలోనే పెళ్లి సెటిల్ చేసేశారు తాపీగా సమాధానమిచ్చాడు వివేక్. దీంతో వివేక్ మీద చీటింగ్ కేసు బుక్ చేసారు పోలీసులు.