Hyundai: మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్

హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) నుంచి క్రెటా నైట్ ఎడిషన్ లాంఛ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో క్రెటా కార్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే.

Hyundai: మార్కెట్లోకి హ్యుందాయ్ క్రెటా నైట్ ఎడిషన్

Hyundai

Hyundai: హ్యుందాయ్ మోటార్ ఇండియా లిమిటెడ్ (హెచ్ఎమ్ఐఎల్) నుంచి క్రెటా నైట్ ఎడిషన్ లాంఛ్ అయింది. ఇప్పటికే మార్కెట్లో క్రెటా కార్లు అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కారుకు సంబంధించి స్పెషల్ నైట్ ఎడిషన్ తీసుకొచ్చింది హ్యుందాయ్. ఇది ఎస్+, ఎస్ఎక్స్ (ఓ) అనే రెండు వేరియెంట్లలో లభిస్తుంది. రెండూ పెట్రోల్, డీజిల్ వెర్షన్లలో అందుబాటులో ఉంటాయి. 1.5 పెట్రోల్ లేదా 1.5 డీజిల్ ఇంజిన్లతో కార్లు రూపొందాయి.

Helmet in Car: కారులో హెల్మెట్ సరిగా పెట్టుకోలేదంటూ చలాన్ విధించిన పోలీసులు: అవాక్కైన వాహనదారుడు

ఈ కార్ల ఎక్స్ షోరూమ్ ప్రారంభ ధర రూ.13.51 లక్షలుగా ఉంది. డీజిల్ వెర్షన్ ఎక్స్ షోరూమ్ గరిష్ట ధర రూ.18.18 లక్షలుగా ఉంది. నైట్ ఎడిషన్ పూర్తిగా బ్లాక్ కలర్ థీమ్‌లో ఉంటుంది. పాత క్రెటా వెర్షన్లతో పోలిస్తే క్రెటా నైట్ ఎడిషన్‌లో కొన్ని కీలక మార్పులు చేశారు. పనోరమిక్ సన్‌రూఫ్, వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ చార్జర్, రేర్ డిస్క్ బ్రేక్స్, ఈఎస్‌సీ, హిల్-స్టార్ట్ అసిస్ట్, మెటల్ పెడల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.