Chandrababu-Sonusood: అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశా: సోనూసూద్

హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశానని సినీ నటుడు సోనూసూద్ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్ తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు.

Chandrababu-Sonusood: హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్ర అభివృద్ధిలో చంద్రబాబు పాత్ర ప్రత్యక్షంగా చూశానని సినీ నటుడు సోనూసూద్ చెప్పారు. ఎన్టీఆర్ ట్రస్టు ద్వారా అందిస్తున్న వైద్య సేవలపై చంద్రబాబు శనివారం వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నటుడు సోనూసూద్ తో పాటు వివిధ రంగాల నిపుణులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. కోవిడ్ పై పోరాటంలో ఇద్దరి ఆలోచనలు కలవటం ఎంతో సంతోషంగా ఉందని చంద్రబాబును ఉద్దేశించి అన్నారు.

ఆంధ్రా, తెలంగాణలు నాకు రెండో ఇల్లు లాంటివని.. నా భార్య ఆంధ్రప్రదేశ్ ఆమె కావటం సంతోషంగా ఉందన్నారు. తెలుగు రాష్ట్రాలతో నాకు ఎంతో ఆత్మీయ అనుబంధం ఏర్పడగా.. కోవిడ్ సమయంలో నాకు తోచిన సాయం అందిస్తున్నందుకు ఎంతో తృప్తినిస్తోందని సోనూసూద్ చెప్పారు. కరోనా మొదటి దశ ప్రభావం రెండో దశలో ప్రజలపై పడిందని.. ఎంతో మంది ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడ్డారని.. అర్థరాత్రి 2గంటల సమయంలోనూ సహాయం అర్థిస్తూ నాకు ఫోన్ కాల్స్ వచ్చేవని, ఆపదలో ఉన్న వారికి సమయంతో సంబంధం లేకుండా సేవ చేయటం నా బాధ్యతగా భావించానని చెప్పారు.

ఎవరికి వారు తాము చేయాలనుకునే సాయాన్ని తక్కువ అంచనా వేసుకోవద్దని కోరిన సోనూ సాయం కోరిన వారి పట్ల ఇతరత్రా ఆలోచన లేకుండా సేవచేయటమే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సేవ చేసేందుకు కుల, మత, ప్రాంతాలతో సంబంధం లేదని.. త్వరలోనే తెలుగు రాష్ట్రాల్లో 18ఆక్సిజన్ ఉత్పత్తి కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. తొలిదశలో కర్నూలు, నెల్లూరు, హైదరాబాద్ తో పాటు మరోచోట 4 ప్లాంట్లు నెలకొల్పుతున్నామని చెప్పారు. ఏపీతో పాటు ఇతర రాష్ట్రాలు తమ వద్ద ఆక్సిజన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరుతున్నాయని.. అందుకు కూడా తాము ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన చంద్రబాబు త్వరలోనే కలిసి ప్రజాసేవకు ఐక్య కార్యాచరణ రూపొందిద్దామని సూచించగా సోనూసూద్ కూడా అందుకు అంగీకరించారు. కరోనా వల్ల ఎంతోమంది అనాథులుగా మారిన విషాధ ఘటనలు అనేకం చోటుచేసుకున్నాయని గుర్తుచేసిన చంద్రబాబు వీటన్నింటిపైనా తోచిన విధంగా స్పందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. మనలో ఉన్న మానవత్వాన్ని నిరూపించుకునేందుకు అంతా ముందుకు రావాలని చంద్రబాబు కోరారు.

ట్రెండింగ్ వార్తలు