Minister Rajesh Tope : కోవిడ్ నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్

చికిత్సకు లతా మంగేష్కర్ స్పందిస్తున్నారని మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. జనవరి 8న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ..

Minister Rajesh Tope : కోవిడ్ నుంచి కోలుకుంటున్న లతా మంగేష్కర్

Lata Mangeshkar

Lata Mangeshkar Health : ప్రముఖ లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ ఆరోగ్యంగానే ఉందని, కరోనా నుంచి కోలుకుంటున్నట్లు వైద్యులు వెల్లడించారని మహారాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్ తోపే ప్రకటించారు. 2022, జనవరి 30వ తేదీ ఆదివారం ఆమె చికిత్స పొందుతున్న బ్రీచ్ కాండీ ఆసుపత్రికి వెళ్లి…వైద్యులతో మాట్లాడారు. ఆమెకు చికిత్స అందిస్తున్న డాక్టర్ Pratit Samdani తో మాట్లాడడంజ జరిగిందని తెలిపారు. ఆమె కోలుకుందని, కొన్ని రోజులు వెంటిలెటర్ పై ఉన్నా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని ఆయన తెలిపారని వెల్లడించారు. ప్రస్తుతం ఆమె వెంటిలెటర్ పై లేదని, కేవలం ఆక్సిజన్ మాత్రమే అందిస్తున్నారన్నారు.

Read More : TDP : విజయవాడ బాలిక ఆత్మహత్య ఘటన.. టీడీపీ ఎదురుదాడి

చికిత్సకు లతా మంగేష్కర్ స్పందిస్తున్నారని మంత్రి రాజేష్ తోపే పేర్కొన్నారు. జనవరి 8న లెజండరీ సింగర్ లతా మంగేష్కర్ కు కొవిడ్-19 పాజిటివ్ అని తేలింది. తేలికపాటి లక్షణాలు ఉన్నప్పటికీ ఆమెను బ్రీచ్ క్యాండీ హాస్పిటల్ లోని ఐసీయూలో అడ్మిట్ చేశారు. అయితే.. ఆమె ఆరోగ్యంపై వదంతులు వచ్చాయి. ఆరోగ్యం బాగోలేదంటూ వచ్చిన వార్తలను అనూష శ్రీనివాసన్ అయ్యర్ అనే ప్రతినిధి ఖండించారు. అవన్నీ తప్పుడు వార్తలని కొట్టిపారేశారు. 1942 లోనే 13ఏళ్ల వయస్సులో ఆమె కెరీర్ ను మొదలుపెట్టారు. పలు భాషల్లో 30వేల పాటలు వరకూ పాడారు. ఎన్నో పాటలు పాడి…అవార్డులు పొందారు. 2001లో దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న అవార్డు ఆమెను వరించింది. పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే వంటి ఉన్నతమైన అవార్డ్స్ వరించాయి.

Read More : Telangana Covid : 24 గంటల్లో 2 వేల 484 కేసులు, కోలుకున్న 4 వేల 207 మంది

మరోవైపు… శనివారం ఉదయం 8 గంటల నుంచి ఆదివారం ఉదయం 8 గంటల వరకు దేశంలో కొత్తగా 2,34,281 కరోనా కేసులు నమోదు అయ్యాయి. ఈమేరకు ఆదివారం విడుదల చేసిన Covid -19 హెల్త్ బులెటిన్ లో కేంద్ర ఆరోగ్యశాఖ వివరాలు వెల్లడించింది. దేశ వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో 893 మంది మహమ్మారి భారిన పడి మృతి చెందారు. దింతో ఇప్పటివరకు భారత్ లో కరోనా భారిన పడి మృతి చెందిన వారి సంఖ్య 4,94,091కి చేరుకుంది. ప్రస్తుతం దేశంలో 18,84,937 యాక్టివ్ కరోనా కేసులు ఉన్నాయి. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ 14.50% శాతానికి చేరుకోగా.. వారాంతపు పాజిటివిటీ రేటు 16.40% శాతంగా ఉంది.