Mann Ki Baat: దేశ యువ‌త‌ను ఓ ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నాను: మోదీ

జ‌ర్మ‌నీలో ప‌ర్య‌టిస్తోన్న భార‌త‌ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రేడియో కార్య‌క్ర‌మం మ‌న్‌కీ బాత్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. 1975, జూన్ 25 నుంచి దాదాపు 21 నెల‌ల పాటు భార‌త్‌లో అత్యవసర పరిస్థితిని విధించిన అంశాన్ని గుర్తు చేశారు.

Mann Ki Baat: దేశ యువ‌త‌ను ఓ ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నాను: మోదీ

Modi Mann Ki Baat

Mann Ki Baat: జ‌ర్మ‌నీలో ప‌ర్య‌టిస్తోన్న భార‌త‌ ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు రేడియో కార్య‌క్ర‌మం మ‌న్‌కీ బాత్‌లో మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. 1975, జూన్ 25 నుంచి దాదాపు 21 నెల‌ల పాటు భార‌త్‌లో అత్యవసర పరిస్థితిని విధించిన అంశాన్ని గుర్తు చేశారు. ”నేను మన దేశ యువతను ఓ ప్ర‌శ్న అడ‌గాల‌నుకుంటున్నాను. మీ త‌ల్లిదండ్రులు మీ వ‌య‌సులో ఉన్న స‌మ‌యంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని ఎదుర్కొన్నారని మీకు తెలుసా? వారి జీవించే హ‌క్కును కూడా హ‌రించారు. ఈ ప‌రిస్థితి 1975, జూన్‌లో ప్రారంభ‌మైంది. ఆ స‌మ‌యంలో దేశంలో అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించారు” అని మోదీ అన్నారు.

Maharashtra: ప‌త‌నం అంచున ‘మ‌హా’ స‌ర్కారు.. శరద్ పవార్ నివాసంలో కీలక భేటీ

”అప్పట్లో దేశంలో పౌరులకు ఉండాల్సిన ఏ హ‌క్కూ లేకుండా చేశారు. జీవించే హ‌క్కు, వ్య‌క్తిగ‌త స్వేచ్ఛ కూడా ఇవ్వ‌లేదు. ఆ స‌మ‌యంలో దేశ ప్ర‌జాస్వామ్యాన్ని నాశ‌నం చేసే ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. దేశంలోని న్యాయ‌స్థానాలు, మీడియాతో పాటు అన్ని రాజ్యాంగ‌బ‌ద్ధ‌ వ్య‌వ‌స్థ‌ల‌నూ నియంత్ర‌ణ‌లోకి తెచ్చుకున్నారు. అనుమ‌తి లేనిదే ఏ విష‌యాన్నీ ప్ర‌చురించ‌వ‌ద్ద‌ని ఆంక్ష‌లు పెట్టారు” అని మోదీ చెప్పారు.

Maharashtra: ఇంకా ఎంత కాలం దాక్కుంటారు: రెబ‌ల్ ఎమ్మెల్యేల‌కు సంజ‌య్ రౌత్ ప్ర‌శ్న‌

కాగా, ఇటీవల అంతర్జాతీయ స్థాయిలో విజయం సాధించిన భారత క్రీడాకారులను మోదీ అభినందించారు. తెలంగాణ పర్వతారోహకురాలు మలావత్ పూర్ణను కొనియాడారు. పూర్ణ 7 సమ్మిట్స్ ఛాలెంజ్ పూర్తి చేసిందని చెప్పారు. ప్రపంచంలో అత్యంత ఎత్తైన 7 పర్వతాలను మలావత్ పూర్ణ అధిరోహించిందని అన్నారు. ఉత్తర అమెరికాలోని అత్యంత ఎత్తైన మౌంట్ దేనాలిని అధిరోహించిదని, 13 ఏళ్ల వయసులో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి అద్భుతాన్ని సృష్టించిందని ఆయ‌న గుర్తు చేశారు. అలాగే, భారత మహిళా క్రికెట్‌కు మిథాలి రాజ్ చేసిన సేవలను మోదీ కొనియాడారు. క్రికెటర్ మిథాలి రాజ్ అనేక మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచింద‌ని చెప్పారు.