IAF : 56 C-295MW విమానాల కొనుగోలుకు కేబినెట్‌ కమిటీ ఆమోదం

అత్యాధునిక C-295 MWరవాణా విమానాల కొనుగోలుకు కేబినెట్‌ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. 40 రవాణా విమానాలను స్వదేశంలోనే తయారు చేయనుంది. 16 విమానాలు స్పెయిన్‌ నుంచి డెలివరీ కానున్నాయి.

IAF : 56 C-295MW విమానాల కొనుగోలుకు కేబినెట్‌ కమిటీ ఆమోదం

Iaf Gets Centre's Nod To Procure C 295mw Transport Aircraft; Ageing Avros To Be Replaced

C-295MW transport aircraft : అత్యాధునిక C-295 MWరవాణా విమానాల కొనుగోలుకు కేబినెట్‌ భద్రతా కమిటీ ఆమోదం తెలిపింది. 2.5 బిలియన్‌ డాలర్ల (రూ.18,451 కోట్లు) వ్యయంతో స్పెయిన్‌కు చెందిన ప్రైవేట్‌ కంపెనీ ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్ నుంచి విమానాలను అందించేందుకు ఓకే చెప్పేసింది. 40 రవాణా విమానాలను స్వదేశంలోనే తయారు చేయనుంది. ఈ భారీ ప్రాజెక్టును ఎయిర్‌బస్ డిఫెన్స్ అండ్ స్పేస్, టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ సంయుక్తంగా చేపట్టనున్నాయి. ప్రైవేట్‌ కంపెనీ సైనిక విమానాలను దేశంలో తయారు చేస్తుండటం ఇదే తొలిసారి.
VK SasiKala : శశికళకు షాకిచ్చిన ఐటీ శాఖ…రూ. 100 కోట్ల ఆస్తులు జప్తు

కాంట్రాక్టుపై ఒప్పందం కుదిరిన తర్వాత నాలుగు ఏళ్ల16C-295 రవాణా విమానాలు స్పెయిన్‌ నుంచి డెలివరీ కానున్నాయి. వచ్చే పదేళ్లలో 40 విమానాలను టాటా కన్సార్టియం స్వదేశంలోనే తయారు చేస్తుంది. మొత్తం 56 రవాణా విమానాలు స్వదేశీ ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ వ్యవస్థను కలిగి ఉంటాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. C-295 MW అత్యాధునిక సాంకేతికతతో వస్తోంది. ఈ రవాణా విమానం 5-10 టన్నుల సామర్థ్యంతో పనిచేయనుంది. భారత వాయుసేనకు చెందిన పురాతన అవ్రో విమానాల స్థానంలో రానున్నాయి.

సైనిక దళాలు, సరుకు రవాణా కోసం ఈ విమానాల వెనుక ర్యాంప్ డోర్‌ అమర్చి ఉంటుంది. ఈ ప్రాజెక్టు దేశంలో ఏరోస్పేస్ రంగం బలోపేతం కానుంది. ఉపాధి కల్పనకు ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. ప్రత్యక్షంగా 600 అత్యంత నైపుణ్య ఉద్యోగాలు, 3,000 పరోక్ష ఉద్యోగాలు కల్పించనుంది. అదనంగా 3000 మధ్యతరహా ఉపాధి అవకాశాలను కల్పించనుంది.

Covid Cases : కేరళలో కరోనా విలయం.. కొత్తగా 30వేల కేసులు