Hyper Aadhi : ఆ వివాదంపై స్పందించిన హైపర్ ఆది..

తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే.

Hyper Aadhi : ఆ వివాదంపై స్పందించిన హైపర్ ఆది..

Hyper Aadhi

Hyper Aadi : తెలంగాణ సంస్కృతిని కించపరిచేలా ఓ టీవీ షోలో వ్యాఖ్యలు చేశాడంటూ టెలివిజన్ కమెడియన్ హైపర్ ఆదిపై తెలంగాణ జాగృతి విద్యార్థి సమాఖ్య పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ వివాదంపై హైపర్ ఆది స్పందించాడు. నేను ఎక్కడా తెలంగాణ సంస్కృతిని కించపరచలేదని స్పష్టం చేశాడు. ఆ టీవీ కార్యక్రమంలో తాను కేవలం ఆర్టిస్టును మాత్రమేనని, ఆ షో స్క్రిప్టు తాను రాయలేదని స్పష్టం చేశాడు. ఒకవేళ తాను తప్పు చేశానని భావిస్తే క్షమాపణ చెప్పేందుకు సిద్ధమని వెల్లడించాడు.

ఆ టీవీ కార్యక్రమం జరిగే వేళ వేదికపై 20 మంది వరకు నటులు ఉన్నారని, ఆ సమయంలో ఎవరు బతుకమ్మ పాట పాడుతున్నారో, ఎవరు గౌరమ్మ పాట పాడుతున్నారో తెలుసుకోలేమని అన్నాడు. తాను పలికిన డైలాగుల్లో తప్పు ఉందని భావిస్తే తనను క్షమించాలని తెలిపాడు. క్షమించాలని అడిగేందుకు తానేమీ బాధపడనని హైపర్ ఆది స్పష్టం చేశాడు. తనకు కూడా తెలంగాణ అంటే గౌరవం ఉందని.. ఎప్పటికీ అలా అవమానపరిచే పనులు చేయను అంటూ చెప్పుకొచ్చాడు ఆది. మొన్న జరిగిన స్కిట్‌లో స్క్రిప్ట్ రైటర్ డైలాగ్స్ రాశాడని.. బిజీ షెడ్యూల్ కారణంగా తాను రిహార్సల్ చేయకుండా నేరుగా స్టేజిపైన పెర్ఫార్మ్ చేశానంటూ వివరణ ఇచ్చాడు. ఇటీవల ఓ చానల్ లో ప్రసారమైన కార్యక్రమం.. వివాదానికి దారితీసింది.

ఓ టీవీలో ప్రసారమైన ఓ కార్యక్రమంలో తెలంగాణ పండుగ బతుకమ్మ, దేవతగా పూజించే గౌరమ్మతో పాటు తెలంగాణ యాస, భాషలను కించపరిచే విధంగా ఆది మాట్లాడాడని తెలంగాణ జాగృతి స్టూడెంట్‌ ఫెడరేషన్‌ ఆరోపించింది. ఈ మేరకు ఆది, స్క్రిప్ట్‌ రైటర్‌తో పాటు మల్లెమాల ప్రొడక్షన్‌పై చర్యలు తీసుకోవాలని ఎల్బీ నగర్‌ ఏసీపీ శ్రీధర్‌రెడ్డికి ఫిర్యాదు చేశారు.

కమెడియన్ హైపర్ ఆదికి కామెడీతో పాటు కాంట్రవర్సీలు కూడా ముందు నుంచి అలవాటుగా మారాయనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆది గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. జూన్ 12 ఆదివారం రోజున ఓ టీవీలో ప్రసారమైన కార్యక్రమంలో తెలంగాణ బతుకమ్మను, గౌరమ్మను, తెలంగాణ భాష యాసని కించపరిచే విధంగా ఆది స్క్రిప్ట్ చేశాడని ఆరోపణలు వ్యక్తమయ్యాయి.