Manikonda ADE : జీతం రూ. 2 లక్షలు..రూ. 30 వేల లంచం కోసం కక్కుర్తి

ప్రతి నెలా రూ. 2 లక్షల వరకు జీతం వస్తుందని..కేవలం రూ. 30 వేల లంచానికి కక్కుర్తిపడ్డారని తేలింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది.

Manikonda ADE : జీతం రూ. 2 లక్షలు..రూ. 30 వేల లంచం కోసం కక్కుర్తి

Acb

Manikonda ADE : చేసేది ప్రభుత్వ ఉద్యోగం..వేలు, లక్షలు జీతాలు తీసుకుంటుంటారు. కానీ..కొంతమంది అధికంగా డబ్బు సంపాదించాలనే ఉద్ధేశ్యంతో…లంచావతారం ఎత్తుతుంటారు. ఫైల్ పై సంతకం కావాలన్నా…అనుమతి కావాలన్నా…లంచాలు డిమాండ్ చేస్తుంటారు కొందరు. దీంతో తమ పని తొందరగా అవుతుందనే ఉద్ధేశ్యంతో..కొంతమంది లంచాలు ఇచ్చుకుంటుంటారు. పని చేయడం వారి విధి..లంచం ఎందుకు ఇవ్వాలంటూ..మరికొంతమంది అవినీతి నిరోధక శాఖ అధికారులను ఆశ్రయిస్తూ..వారిని రెడ్ హ్యాండెండ్ గా పట్టిస్తుంటారు. తాజాగా.. ఓ అధికారి అవినీతి అధికారులకు దొరికిపోయాడు. అతని గురించి ఆరా తీస్తే..విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. అతనికి ప్రతి నెలా రూ. 2 లక్షల వరకు జీతం వస్తుందని..కేవలం రూ. 30 వేల లంచానికి కక్కుర్తిపడ్డారని తేలింది. ఈ ఘటన హైదరాబాద్ నగరంలో చోటు చేసుకుంది. రంగారెడ్డి జిల్లా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ సూర్యనారాయణ కథనం ప్రకారం…

Read More : Raped : సంతానం కోసం దారుణం.. మహిళను బంధించి 16 నెలలుగా అత్యాచారం

గోల్కొండ ఇబ్రహీంబాగ్ విద్యుత్ సబ్ డివిజన్ లో చరణ్ సింగ్ ఏడీఈగా విధులు నిర్వహిస్తున్నారు. మొయినాబాద్, నార్సింగ్, ఇబ్రహీపట్నం, నార్సింగ్ డివిజన్లు ఇతని పరిధిలోకి వస్తాయి. మణికొండకు చెందిన రవి అనే వ్యక్తి..కొన్ని సంవత్సరాలుగా…చిన్న చిన్న పనులను చేస్తున్నాడు. మణికొండలో విద్యుత్ తీగలను ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి మార్చడం, కొత్త ట్రాన్స్ ఫార్మర్లను అమర్చాల్సిన టెండర్ ను రవి దక్కించుకున్నాడు. అందుకు అవసరమైన అనుమతి పత్రం తీసుకోవాల్సి ఉంది. అయితే..ఈ అనుమతి పత్రం ఇవ్వాలంటే..తనకు లంచం ఇవ్వాలని ఏడీఈ చరణ్ సింగ్ డిమాండ్ చేశారు.

Read More : Children Vaccine : పిల్లలకు టీకా.. తొందరపడటం ఇష్టం లేదన్న కేంద్రమంత్రి

దీంతో రవి..అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. తన పని పూర్తి కావాలంటే..రూ. 30 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్ చేశాడని అధికారులకు తెలిపారు. వారి సూచన మేరకు..2021, నవంబర్ 12వ తేదీ శుక్రవారం…మధ్యాహ్నం రవి రూ. 30వేల డబ్బుతో ఏడీఈ కార్యాలయానికి చేరుకున్నాడు. లంచం సొమ్మును చరణ్ సింగ్ కు ఇస్తుండడం..వెంటనే అవినీతి నిరోధక శాఖ అధికారులు ఎంటర్ అయ్యారు. విచారణ అనంతరం ఆయన్ను ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరిచి జైలుకు తరలించినట్లు…చరణ్ సింగ్ నివాసాలు..కార్యాలయాల్లో..సోదాలు జరిపినట్లు డీఎస్పీ సూర్యనారాయణ వెల్లడించారు.