ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250 బాదేవాడు

ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250 బాదేవాడు

Virat Kohli: టీమిండియా మాజీ బౌలర్ ఆశిష్ నెహ్రా.. తొలి టెస్టు చివరి రోజు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ప్రదర్శనను తెగ మెచ్చుకుంటున్నాడు. మంగళవారం ఇంగ్లాండ్ తో జరిగిన టెస్టులో ఇండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ కూడా 250పరుగులు చేసేవాడని అన్నాడు. 420పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగి శుభమన్ గిల్ సహకారంతో జట్టు కోసం చాలా శ్రమించాడు.

ఈ క్రమంలోనే కోహ్లీ తన 24వ హాఫ్ సెంచరీ పూర్తి చేసేసుకున్నాడు. బెన్ స్టోక్స్ బౌలింగ్ లో 72పరుగులకే అవుట్ అయి సెంచరీ మిస్ చేసుకున్నాడు. కాకపోతే చాలా సహనం వహించి.. ఇంగ్లాండ్ తో పోరాడాడు. తొలి టెస్టులో సెంచరీ నమోదు చేయకపోయినా.. మిగిలిన మూడు టెస్టుల్లో కలిపి ఒకటి లేదా రెండు సెంచరీలు అయినా చేస్తాడని అభిమానులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. నెహ్రా మాత్రం టీమిండియా టాస్ గెలిచి ఉంటే కోహ్లీ 250వరకూ స్కోర్ చేసేవాడని అంటున్నాడు.

మీరంతా ఒకటి లేదా రెండు సెంచరీల గురించి మాట్లాడుతున్నారు. నేను మాత్రం టీమిండియా టాస్ గెలిచి ఉంటే.. కోహ్లీ 250స్కోరు చేసి ఉండేవాడని చెప్పారు. విరాట్ కోహ్లీకి ఇదొక ప్రత్యేకమైన విషయం. రవిచంద్రన్ అశ్విన్ అవుట్ అయినప్పుడే మ్యాచ్ ఓడిపోతామని అర్థమైపోయినా.. కోహ్లీ చెదురుబెదురు షాట్స్ ఆడకుండా నిదానం వహించాడు.

డిఫరెంట్ పిచ్ మీద కూడా కోహ్లీ బాగా ఆడాడు. ఒక్క ఓవర్లో నాలుగు ఫోర్లతో చెలరేగాడు. మొత్తం 104బంతుల్లో 9ఫోర్లు బాదేశాడు. అశ్విన్ తో కలిసి 50కు మించిన భాగస్వామ్యం నమోదు చేశాడు. అతను చేయాలనుకుంది మిగిలిన వారితో పోల్చితే పూర్తిగా డిఫరెంట్. విరాట్ కోహ్లీలా డిఫెన్సివ్ షాట్స్ ఆడేవారిని చాలా తక్కువ మందిని చూసి ఉంటాం. అలా చేయాలంటే ముందు ఫిట్‌నెస్ కావాలి’ అని నెహ్రా చెప్పుకొచ్చాడు.