Bombay HC: క్రికెట్ కిట్ కొన్న పేరెంట్స్ మంచి నీళ్లు కొనలేరా? బాంబే హై కోర్టు ప్రశ్న

క్రికెట్ స్టేడియంలలో మంచి నీళ్లు ఏర్పాటు చేసేలా చూడాలంటూ దాఖలైన పిటిషన్‌పై బాంబే హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది.

Bombay HC: క్రికెట్ కిట్ కొన్న పేరెంట్స్ మంచి నీళ్లు కొనలేరా? బాంబే హై కోర్టు ప్రశ్న

Bombay Hc

Bombay HC: పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్.. మంచి నీళ్లు కొనివ్వలేరా? అని ప్రశ్నించింది బాంబే హై కోర్టు. క్రికెట్ గ్రౌండ్స్‌లో మంచినీళ్లు ఏర్పాటు చేసేలా ఆదేశించాలని కోరుతూ రాహుల్ తివారి అనే న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్‌పై బాంబే హై కోర్టు విచారణ జరిపింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ ఎమ్ఎస్.కార్నిక్ ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై గురువారం విచారణ జరిపింది.

Droupadi Murmu: భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము.. యశ్వంత్ సిన్హాపై ఘన విజయం

ఈ సందర్భంగా.. పిల్లలకు క్రికెట్ కిట్ కొనివ్వగలిగిన పేరెంట్స్, వాటర్ బాటిల్స్ కూడా కొనివ్వగలరని అభిప్రాయపడింది. ‘‘క్రికెట్ ఆడే పిల్లలకు పేరెంట్స్ చెస్ట్ గార్డ్, నీ గార్డ్, ఇతర యాక్సెసరీస్ కొనివ్వగలిగినప్పుడు మంచి నీళ్ల బాటిళ్లు కూడా కొనివ్వగలరు. ఇప్పటికీ మంచి నీళ్లు కొనుక్కోలేని స్థితిలో ఉన్న గ్రామాల్లోని ప్రజల గురించి ఒక్కసారి ఆలోచించండి. ఔరంగాబాద్ నగరంలో వారానికి ఒక్కరోజే నీళ్లు వస్తాయి. అలాంటిది మీరు క్రికెట్ ఆడేటప్పుడు మంచి నీళ్లు తెచ్చుకోలేరా? అయినా క్రికెట్ మన ఆట కాదు. ఇంగ్లండ్ నుంచి వచ్చింది. ఈ అంశం అంత ముఖ్యమైందేమీ కాదు. మా ప్రాధాన్యతల్లో వందో స్థానంలో ఉంటుంది. దేశంలో ఎన్నో సమస్యలున్నాయి. వరదలు, అక్రమ నిర్మాణాలు వంటివి ఉన్నాయి.

Woman Gives Birth on Road: రోడ్డు ప్రమాదం.. ఆడబిడ్డను ప్రసవించి గర్భిణి మృతి

ముందు మహారాష్ట్రలోని గ్రామాల్లో ఉండే ప్రజలకు మంచినీళ్లు అందనివ్వండి. మా సమయాన్ని వృథా చేయొద్దు’’ అంటూ కోర్టు వ్యాఖ్యానించింది. వాంఖడే స్టేడియంలో కూడా ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎమ్‌సీఏ) మంచి నీళ్లు అందివ్వడం లేదు. దీనిపై ప్రశ్నిస్తే బీఎమ్‌సీ (బృహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్)ది బాధ్యత అంటూ ఎమ్‌సీఏ… లేదు ఈ బాధ్యత ఎమ్‌సీఏదే అంటూ బీఎమ్‌సీ తప్పించుకుంటున్నాయి.