Updated On - 12:16 pm, Sun, 21 February 21
Whatsapp Privacy policy: వాట్సప్ న్యూ ప్రైవసీ పాలసీ గురించి బోలెడు విమర్శలు ఎదుర్కొన్న అమెరికన్ మెసేజింగ్ సర్వీస్.. మార్పులను మన ముందుపెట్టి వాటికి మే15ను డెడ్ లైన్ గా పెట్టింది. ఈ కండీషన్స్ ఒప్పుకుంటే అందరూ తెలుసుకున్నారు. కానీ, అస్సలు వాటిని యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుంది.. మే 15తర్వాత వారి పరిస్థితేంటి.
అలా చేయకపోతే మనం మెయిన్ ఫంక్షనాలిటీని మిస్ అయిపోతామట. ఈ మేర వాట్సప్ కొత్త ఎఫ్ఏక్యూ పేజి టైటిల్ తో ప్రైవసీ పాలసీని ఒప్పుకోకపోతే ఏం జరుగుతుందో చెప్తుంది ఇలా.. ‘కాసేపటి క్రితం మెసేజెస్, కాల్స్, నోటిఫికేషన్స్ వేటిని యాప్ నుంచి చూడటానికి ఉండదట’
అందుకోసం మనం చేయాల్సింది
1. కొత్త ప్రైవసీ పాలసీలను యాక్సెప్ట్ చేయడం
2. మీ చాట్ హిస్టరీని డౌన్ లోడ్ చేసుకుని వేరే మెసేజింగ్ యాప్ కు వెళ్లిపోవడం.
ఇప్పుడు మాత్రం వాట్సప్ స్టైల్ మార్చి న్యూ ప్రైవసీ పాలసీలను మే15తర్వాత కూడా యాక్సెప్ట్ చేయొచ్చని చెప్తుంది. అది కూడా పూర్తి ఫంక్షనాలిటీతో. ఆ డెడ్ లైన్ అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ బటన్ క్లిక్ చేయకపోతే.. మీ అకౌంట్ ఇన్ యాక్టివ్ లో ఉంటుంది కాబట్టి.. అలా ఉన్న అకౌంట్లోని 120రోజుల క్రితం మెసేజెస్ అన్నీ డిలీట్ అయిపోతాయి.
అకౌంట్ యాక్టివ్ లో ఉండాలంటే ఇంటర్నెట్ కనెక్షన్ యాక్టివ్ గా ఉండాలి. ఎవరైతే వ్యక్తి వాట్సప్ ఓపెన్ చేసినప్పుడు ఇంటర్నెట్ కనెక్టివిటీ లేకుండా ఉందో అది ఇన్ యాక్టివ్ లో ఉన్నట్లే. అంటే కొత్త ప్రైవసీ పాలసీలను ఒప్పుకోవడానికి ఇంకా 120రోజుల సమయం ఉన్నట్లే. అంటే మే15తర్వాత కొత్త రూల్స్ ఒప్పుకోకపోయినా కొన్ని రోజుల వరకూ పనిచేస్తుంది.
దాంతో పాటు మీకు కావాలంటే.. వాట్సప్ డేటాను టెలిగ్రామ్ కు మార్చుకోవచ్చు. వాట్సప్ చాట్ లో మీడియా, డాక్యుమెంట్లు, పర్సనల్ లాంటి వాటిని టెలిగ్రామ్ లోకి ఎక్స్ పోర్ట్ చేసుకునే ఫీచర్ అందుబాటులోనే ఉంది.
Messenger Chats : వీడియో చాట్ కన్నా మెసేంజర్ చాట్స్ ముద్దు.. అందరిని దగ్గరకు చేర్చాయి!
WhatsApp: రంగుల్లో.. వాట్సప్‌లో మరో కొత్త ఫీచర్..
Nude Videos : న్యూడ్ వీడియాలతో యువతి బ్లాక్ మెయిల్, వేధింపుల తట్టుకోలేక విద్యార్థి ఆత్మహత్య
Whatsapp Stop Working : వాట్సాప్ యూజర్లకు షాక్.. ఈ ఫోన్లలో ఇక పనిచేయదు.. మీ మొబైల్ ఓఎస్ వర్షన్ ఇలా తెలుసుకోండి
డెస్క్‌టాప్ యూజర్ల కోసం వాట్సాప్ కొత్త ఫీచర్
ఒక్క సెల్ఫీ.. జైల్లో చెమట్లు పట్టించింది.. 600 తాళాలు, పాస్ వర్డులు మార్చేసింది