Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇవి తీసుకోండి

వివిధ రకాల ధాన్యాలను ఉపయోగించి తయారు చేసుకున్న పిండితో మల్టిగ్రెయిన్ దోసను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలగటమే కాక శులభంగా బరువుతగ్గుతారు.

Lose Weight : బరువు తగ్గాలంటే… ఉదయం బ్రేక్ ఫాస్ట్ లోకి ఇవి తీసుకోండి

Breakfast (1)

Lose Weight : బరువు తగ్గాలంటే, ముందుగా ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకోవాలి. డైట్ ప్లాన్ మార్పులు చేసుకుంటే తప్పకుండా బరువు తగ్గేందుకు అవకాశం ఉంటుంది. బరువు తగ్గించే క్రమంలో మీరు ఉదయం తీసుకొనే అల్పాహారం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అందువల్ల మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకొనే ఆహారంలో అన్నిరకాల విటమిన్స్ , మినిరల్స్, ఫైబర్, కార్బోహైడ్రేట్స్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ అన్నీ ఉండేట్లు చూసుకోవాలి.

సాధార‌ణంగా కొంద‌రు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ చేయ‌రు. నేరుగా మ‌ధ్యాహ్నం భోజ‌న‌మే చేస్తుంటారు. అయితే వాస్త‌వానికి ఉద‌యం మ‌నం తీసుకునే ఆహారంలో అన్ని పోష‌కాలు ఉండేలా చూసుకోవాలి. ముఖ్యంగా ప్రోటీన్లు, కొవ్వులు ఉద‌యాన్నే ఎక్కువ‌గా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో రోజులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల్లో అధిక భాగం ఉద‌యం ఆహారం నుంచే వ‌స్తాయి. ఈ క్ర‌మంలో శ‌క్తి ల‌భిస్తుంది. ఉత్సాహంగా ఉండ‌వ‌చ్చు.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో తీసుకోవాల్సిన  ఆహారాలు ఏమిటో చూదాం…

బరువు తగ్గించే ప్రోటీన్ ఫుడ్స్ లో శక్తివంతమైనది గుడ్డు. గుడ్డులోని పచ్చసొన కంటే తెల్ల సొన ఎక్కువగా తినడం వల్ల శరీరానికి ప్రోటీన్స్, క్యాల్షియం పుష్కలంగా అంది, ఎనర్జినీ అందివ్వడంతో పాటు, బరువు తగ్గిస్తాయి. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఒక కోడిగుడ్డును త‌ప్ప‌కుండా తీసుకోవాలి. ఇందులో మ‌న‌కు కావ‌ల్సిన పోష‌కాల‌న్నీ దాదాపుగా ఉంటాయి. ప్రోటీన్లు, కొవ్వులు ల‌భిస్తాయి. అందువ‌ల్ల క‌చ్చితంగా ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో కోడిగుడ్డు ఉండేలా ప్లాన్ చేసుకోవాలి. ఉడ‌క‌బెట్టి లేదా ఆమ్లెట్ రూపంలో తిన‌వ‌చ్చు. కూర‌గాయ‌ల‌తో క‌లిపి ఆమ్లెట్‌లా చేసుకుని తింటే రుచిగా ఉంటుంది. ఇంకా ఎక్కువ పోష‌కాలు ల‌భిస్తాయి.

అటుకులతో తయారుచేసే పోహాను అల్పాహారంగా తీసుకోవటం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఇది మీ పొట్టను తేలికగా ఉంచుతంది, చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉండే పోహా కళ్ళఆరోగ్యానికి చాలా మంచిది. ప్రోబయోటిక్ ఫుడ్స్ డైట్ లో ఎనర్జిటిక్ ఫుడ్స్ . అంతే కాదు బరువు తగ్గించడంలో కూడా ముఖ్యపాత్రపోషిస్తుంది. ఉదయం తీసుకోవడం వల్ల జీర్ణాశయం శుభ్రపడుతుంది . తద్వారా వ్యాధులను దూరం చేస్తుంది.

దాల్ కిచిడి లేదా బార్లీ కిచిడిని చాలా తక్కువ మాసాల దినుసులు, కారం తక్కువగా చేసుకుంటే, అంది మీకు మరింత ఎక్కువ పోషకాలను అందిస్తుంది. కిచిడి పొట్టనింపే బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్. అంతే కాదు, ఇది ఖచ్చితంగా మిమ్మల్ని బరువు పెరగనివ్వదు. దీనిలో వెన్న లేదా నెయ్యిని తీసుకోవాలి. దీంతో మ‌న‌కు విట‌మిన్లు ఇ, కె లు ల‌భిస్తాయి. ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు అందుతాయి. ఇవి శ‌క్తిని అందిస్తాయి. రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి.

ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో బాదంప‌ప్పును తీసుకుంటే మంచిది. రాత్రి పూట గుప్పెడు బాదంప‌ప్పును నాన‌బెట్టి మ‌రుస‌టి రోజు ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో వాటిని పొట్టు తీసి తినాలి. వీటి వ‌ల్ల పోష‌కాలు ఎక్కువ‌గా అందుతాయి. రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. వ్యాధుల నుంచి ర‌క్ష‌ణ ల‌భిస్తుంది.ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తీసుకోవ‌డం వ‌ల్ల గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చు. అందులో అర‌టి పండును క‌లిపి తింటే బీపీ త‌గ్గుతుంది. ర‌క్త స‌ర‌ఫ‌రా మెరుగు ప‌డుతుంది.

ఉద‌యం తీసుకోవాల్సిన ఆహారాల్లో స్ట్రాబెర్రీలు ఒక‌టి. వీటి ద్వారా విట‌మిన్ సి పుష్క‌లంగా ల‌భిస్తుంది. ఇక చివ‌రిగా గ్రీన్ టీని తాగాలి. దీంతో మెట‌బాలిజం పెరుగుతుంది. శ‌రీరంలో ఉన్న కొవ్వు క‌రుగుతుంది. అధిక బ‌రువు త‌గ్గుతారు. అలాగే గుండె స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి.

వివిధ రకాల ధాన్యాలను ఉపయోగించి తయారు చేసుకున్న పిండితో మల్టిగ్రెయిన్ దోసను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకుంటే ఆరోగ్యానికి మేలు కలగటమే కాక శులభంగా బరువుతగ్గుతారు. బరువు తగ్గాలని అనుకుంటే దోసను ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఎంపిక చేసుకోవచ్చు. దోసెకు చాలా తక్కువగా నూనెను ఉపయోగించాలి. నాన్ స్టిక్ పాన్ తో దోసెను తయారుచేసి తీసుకోవచ్చు. ఇది హెల్తీ బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్.

పచ్చిబఠానీలు ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. 1 కప్పు పచ్చిబఠానీల్లో 3గ్రాముల ప్రోటీన్స్ ఉంటాయి . ఇది బెస్ట్ వెయిట్ లాస్ ఫుడ్. ఇది శరీరానికి అవసరం అయ్యే ప్రోటీన్స్ మరియు ఫైబర్ ను అందిస్తుంది . వీటిని పచ్చిగా లేదా ఉడికించి తీసుకోవచ్చు.

బరువు తగ్గడానికి ఆవిరిలో ఉడికించిన పదార్థాలన్నీ బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవచ్చు. గోధుమ రవ్వ లేదా రాగి ఇడ్లీలను హెల్తీ బ్రేక్ ఫాస్ట్ గా ఎంపిక చేసుకోండి. హెల్తీ బ్రేక్ ఫాస్ట్ కు ఓట్స్ కు హెల్తీ ఫ్రూట్స్ మరియు పాలు మిక్స్ చేసి తీసుకోవాలి. ఇలా తీసుకోవడం మీకు ఇష్టం లేకపోతే ఉప్మా లేదా దోసె రూపంలో తీసుకోవచ్చు.