యువకుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో చంపేసింది

వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అటువంటి వాటికి జోలికి

  • Published By: naveen ,Published On : May 14, 2020 / 11:51 AM IST
యువకుడి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం, మరొకరితో పెళ్లికి సిద్ధమవడంతో చంపేసింది

వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అటువంటి వాటికి జోలికి

వివాహేతర సంబంధాలు కరెక్ట్ కాదు. ఏ మాత్రం తేడా వచ్చినా ప్రాణాలు పోతాయి. అటువంటి వాటికి జోలికి వెళ్లొద్దని పోలీసులు నెత్తీనోరు బాదుకుంటున్నా మార్పు రావడం లేదు. అక్రమ సంబంధాల కారణంగా ప్రాణాలు పోతున్నాయి. పచ్చని సంసారాలు నాశనం అవుతున్నాయి. పిల్లలు అనాథలుగా మారుతున్నారు. మనుషులు క్రిమినల్స్ అవుతున్నారు. జైలు పాలవుతున్నారు. తాజాగా వివాహేతర సంబంధం ఓ యువకుడి ప్రాణం తీసింది. తెలంగాణ రాష్ట్రం నాగర్ కర్నూలు జిల్లాలో ఈ దారుణం జరిగింది. అప్పటివరకు తనతో అక్రమ సంబంధం నెరిపిన యువకుడు, మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో సదరు మహిళ తట్టుకోలేకపోయింది. మద్యం మత్తులో ప్రియుడి గొంతు కోసి హత్య చేసింది. 

రెండేళ్లుగా అక్రమ సంబంధం:
నాగర్ కర్నూలు జిల్లా అమ్రాబాద్ మండలం మన్ననూర్ కు చెందిన ఆంజనేయులు(22).. అదే గ్రామానికి చెందిన బాలమ్మ(అలియాస్ బాలమణి) అనే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. రెండేళ్లుగా వీరి బంధం నడుస్తోంది. ఈ విషయం తెలుసుకున్న యువకుడి కుటుంబ సభ్యులు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టారు. ఇద్దరిని మందలించారు. బుద్ధిగా ఉండాలని హితవు చెప్పారు. ఆంజనేయులు తప్పు చేశాడని తెలిసినా తన కూతురితో వివాహం చేసేందుకు మేనమామ శ్రీనివాసులు నిర్ణయం తీసుకున్నాడు. 

మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా అని చంపేసింది:
కాగా, పెళ్లి విషయాన్ని మే 5న వివాహేతర సంబంధం పెట్టుకున్న బాలమ్మతో ఆంజనేయులు చెప్పాడు. ఆ రోజు రాత్రి ఎప్పట్లానే ఇద్దరూ మద్యం తాగారు. కాసేపటికి పెళ్లి విషయమై బాలమ్మ ఆంజనేయులుతో గొడవ పడింది. ఆగ్రహంతో ఊగిపోయింది. నన్ను వదిలిపోతావా అంటూ ఘర్షణ పడింది. ఇంట్లో ఉన్న కత్తితో ఆంజనేయులు గొంతు కోసి చంపింది. ఆ తర్వాత గోనె సంచిలో మృతదేహాన్ని పెట్టి ఇంటి సమీపంలో ఎస్‌బీఐ బ్యాంకు పక్కన ఉన్న డ్రైనేజీ కల్వర్టులో పడేసింది. 

కాల్వలో మృతదేహం లభ్యం:
విషయం తెలియని ఆంజనేయులు కుటుంబీకులు మే 6న యువకుడు అదృశ్యమైనట్లు అమ్రాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 8వ తేదీన మన్ననూర్‌ ఎస్బీఐ ఎదుట కాల్వ నుంచి దుర్గందం రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి చూడగా మృతదేహం లభ్యమైంది. అది ఆంజనేయులు మృతదేహంగా గుర్తించిన పోలీసులు విచారణ చేపట్టారు. బాలమ్మ హత్య చేసినట్లు నేరం ఒప్పుకోవడంతో మర్డర్ మిస్టరీ వీడింది. కేసు నమోదు చేసిన పోలీసులు బాలమ్మను రిమాండ్‌కు తరలించారు.

Read Here>> లాక్ డౌన్ లో పెళ్లి, అదే లాక్ డౌన్ లో ఆత్మహత్య.. నెల రోజుల్లో ప్రేమజంటకు ఏం జరిగింది