Cat fish: క్యాట్ ఫిష్ అక్రమ పెంపకం.. తింటే క్యాన్సర్ ముప్పు..!

క్యాట్ ఫిష్.. ఇది కుళ్ళిన మాంసాన్ని తిని పెరిగే చేప. అందుకే సుప్రీంకోర్టు ఎప్పుడో దీన్ని నిషేదిత జాబితాలో చేర్చింది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకాన్ని 10టీవీ బైటపెట్టింది.

Cat fish: క్యాట్ ఫిష్ అక్రమ పెంపకం.. తింటే క్యాన్సర్ ముప్పు..!

Illegal Rearing Of Catfish Eating Cancer Threat

Cat fish: క్యాట్ ఫిష్.. ఇది కుళ్ళిన మాంసాన్ని తిని పెరిగే చేప. అందుకే సుప్రీంకోర్టు ఎప్పుడో దీన్ని నిషేదిత జాబితాలో చేర్చింది. కానీ చాటుమాటుగా క్యాట్ ఫిష్ పెంపకాలు జరుగుతునే ఉన్నాయి. ఏపీలోని ప్రకాశంజిల్లాలో రహస్యంగా క్యాట్ ఫిష్ పెంపకాన్ని 10టీవీ బైటపెట్టింది. పొలాల మధ్యలో చిన్న చిన్న చెరువులలో వీటి పెంపకాన్ని చేపట్టి కొందరు కాసులు వెనకేసుకుంటున్నారు. చేపలలో బాగా డిమాండ్ ఉండే కోరమీనును పోలి ఉండే ఈ చేపను మీసాలు పీకేసి కోరమీను పేరుతో ఎక్కువ ధరలకు అమ్మేస్తున్నారు. కిలో రూ.400లు ఉంటే కోరమీను పేరుతో కిలో రూ.150 ఉండే క్యాట్ ఫిష్ ను యథేచ్ఛగా అమ్మేస్తున్నారు.

కుళ్ళిన మాంసమే ప్రధాన ఆహరంగా పెరిగే ఈ క్యాట్ ఫిష్ కేవలం ఆరునెలల్లోనే ఇరవై కేజీల బరువు వరకు పెరుగుతుందటే అర్ధం చేసుకోవచ్చు దీన్ని ఎందుకు డెడ్లీ ఫిష్ అన్నారో. ఈ చేపలున్న కుంటలు లేదా చెరువులో జంతువులు దిగితే వాటిని కూడా చంపితినేస్తాయి. మనుషులు దిగినా దాడి చేసి తినేస్తాయి. ఈ చేపల పెంపకంతో పర్యావరణం దెబ్బతినడమే కాకుండా భూగర్భ జలాలు, వాతావరణం కలుషితమవుతుంది. అందుకే సుప్రీంకోర్టు దీనిని నిషేదించింది. కానీ.. అక్రమంగా పెంచి కోరమీను పేరుతో అమ్మేస్తున్నారు.

ఈ చేపలను తింటే పాటు తీవ్ర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. క్యాట్ ఫిష్ లో ఉండే ఒమేగా ఫ్యాట్ 6 ఆమ్లాలతో నరాల వ్యవస్థ దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇక దీన్ని తినేప్పుడు చేప దవడ కింద ఉన్న ముల్లు తినేవారి ప్రాణాలకే ప్రమాదం. అయితే అధికారుల పర్యవేక్షణ లోపంతో వీటి పెంపకం, అమ్మకాలు జరిగిపోతున్నాయి. ఒకవైపు కరోనా విపత్కర పరిస్థితుల్లో రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు చేపలను తినాలని వైద్యులు చెప్తుండగా ఇలా కొర్రమీను పేరుతో క్యాట్ ఫిష్ ను అంటగట్టే దగుల్భాజీ వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది.