CM Pinarayi vijayan : ‘కేరళ సీఎంను పినరయి విజయన్‌ను కాల్చి పారేస్తా’: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు

 కేరళ సీఎం పినరాయి విజయన్ ను తుపాకీతో కాల్చి పారేస్తాను అంటూ కేరళ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు.

CM Pinarayi vijayan : ‘కేరళ సీఎంను పినరయి విజయన్‌ను కాల్చి పారేస్తా’: మాజీ ఎమ్మెల్యే భార్య సంచలన వ్యాఖ్యలు

Im ready to shoot CM says PC George wife Usha George : కేరళ సీఎం పినరాయి విజయన్ ను తుపాకీతో కాల్చి పారేస్తాను అంటూ కేరళ మాజీ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే పీసీ జార్జ్ భార్య ఉషా జార్జ్ మీడియా ముందు సంచలన వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపుల కేసులో అరెస్టు అయి..బెయిలుపై విడుదలైన తన భర్తను వేధిస్తున్నారని దీని వెనుక సీఎం విజయన్ ఉన్నారంటూ ఆరోపించారు ఉషా జార్జ్.తిరువనంతపురంలో నిన్న ఆమె మీడియాతో ఉషా జార్జ్ మాట్లాడుతూ.. అమాయకుడైన నా భర్తను వేధిస్తున్న సీఎం పినరయి విజయన్‌ను తుపాకితో కాల్చి పారేస్తాను అంటూ హెచ్చరించారు. తన భర్తపై తప్పుడు కేసులు పెట్టి తన భర్తను వేధిస్తున్నారని, దీని వెనక సీఎం ఉన్నారు అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు.

సీఎం నా భర్తను..నా కుటుంబాన్ని తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఉషా జార్జ్ ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం అవినీతిని నా భర్త బయటపెట్టారని అందుకే కక్షపూరితంగా ఇలా తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారని వెల్లడించారు. తన తండ్రి రివాల్వర్‌తో నేను సీఎంను కాల్చిపారేయటానికి రెడీగా ఉన్నాను అంటూ బహిరంగంగానే హెచ్చరించారు ఉషా జార్జ్.

కాగా..కేరళలో సంచలనం సృష్టించిన గోల్డ్ స్మగ్లింగ్ కేసులో విజయన్‌పై జార్జ్ పలు ఆరోపణలు చేశారు. వ్యాపారవేత్త ఫారిస్ అబూబకర్‌తో ఆయనకున్న సంబంధాలపై దర్యాప్తు చేయాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను అభ్యర్థించారు. అనంతరం లైంగిక వేధింపుల కేసులో పీసీ జార్జ్‌కు మేజిస్ట్రేట్ కేసు బెయిల్ మంజూరు చేసింది.

రెండు నెలల క్రితం ఏప్రిల్ 29న ముస్లింలకు వ్యతిరేకంగా..విద్వేషపూరిత ప్రసంగం చేసినందుకు జార్జ్ అరెస్ట్ అయి బెయిల్‌పై విడుదల కావడం గమనించాల్సిన విషయం. జార్జ్ తన ప్రసంగంలో కేరళలోని ముస్లిమేతరులు కమ్యూనిటీ నిర్వహించే రెస్టారెంట్లలో భోజనం చేయవద్దని పిలుపునిస్తూ వివాదానికి తెర లేపారు. దీంతో జార్జ్ ను మే1న పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో తనను కేరళ సీఎం పినరయి విజయన్ టార్గెట్ చేస్తున్నారని పీసీ జార్జ్ ఆరోపించారు. తన అరెస్టు ‘కేరళ సీఎం పన్నిన కుట్రలో భాగమే’ అని కూడా జార్జ్ ఆరోపించారు.

కాగా జార్జ్ కు బెయిట్ మంజూరు చేస్తూ..53A/295A కింద ఎలాంటి నేరం జరిగినా ఎలాంటి ప్రకటన చేయకూడదనే షరతులకు లోబడి పిటిషనర్ బెయిల్‌పై విడుదల చేయాలని సూచిస్తూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.