Image Tower : యానిమేషన్ గేమింగ్ హబ్‌గా హైదరాబాద్… రూ.945 కోట్లతో ఇమేజ్ టవర్ నిర్మాణం

ఐటీతో పాటు గేమింగ్ రంగానికి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాయదుర్గంలో ఇమేజ్ టవర్ నిర్మిస్తోంది. 16లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో ఇది అందుబాటులోకి రాబోతోంది. రూ.945 కోట్లతో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్స్ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ, స్టార్టప్ కంపెనీలకు టీ-హబ్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు.. గేమింగ్ ఇండస్ట్రీకి ఇమేజ్ టవర్స్ చిరునామాగా మారనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో గేమింగ్ కంపెనీలు పని చేస్తున్నాయి.

Image Tower : యానిమేషన్ గేమింగ్ హబ్‌గా హైదరాబాద్… రూ.945 కోట్లతో ఇమేజ్ టవర్ నిర్మాణం

Image Tower : ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీ రంగంలో భారీగా పెట్టుబడులు ఆకర్షిస్తున్న హైదరాబాద్ ఇప్పుడు యానిమేషన్ గేమింగ్ హబ్ గా మారబోతోంది. ఈ రంగంలోని దిగ్గజ సంస్థలు నగరంపైన దృష్టి పెట్టాయి. ఐటీలో మేటి సంస్థలు కొలువుదీరిన భాగ్యనగరంలో ఇప్పుడు గేమింగ్ కంపెనీల కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి.

యాపిల్, గూగుల్, అమెజాన్, మైక్రోసాఫ్ట్, ఒరాకిల్, టీసీఎస్, ఇన్ఫోసిస్ వంటి టాప్ ఐటీ కంపెనీలు నగరం నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఈ రంగంలో ఎగుమతుల్లో దూసుకుపోతున్న హైదరాబాద్ యానిమేషన్ గేమింగ్ లోనూ అదే ఒరవడి కొనసాగించే అవకాశం ఉందని ఐటీ నిపుణులు అంచనా వేస్తున్నారు. దేశంలో త్వరలోనే 5జీ సేవలు అందుబాటులోకి రానున్నాయి.

ఇంటర్నెట్ వినియోగంతో పాటే డేటా వినియోగం రోజురోజుకి పెరుగుతోంది. ఆన్ లైన్ గేమ్స్ ఆడేవారు ఎక్కువ అవుతున్నారు. యానిమేషన్ గేమింగ్ అభివృద్ధికి ఇదే కీలకంగా మారింది. పిల్లల నుంచి పెద్దల వరకు అందరినీ ఆకట్టుకునే విధంగా కొత్త కంపెనీలు గేమ్స్ అభివృద్ధి చేస్తున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని తెలంగాణ ప్రభుత్వం గేమింగ్ రంగంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు గేమింగ్ పాలసీని తీసుకొచ్చి రాయితీలను ప్రకటించింది.
పాలసీ ఆకర్షణీయంగా ఉండటంతో గేమింగ్ సంస్థలు హైదరాబాద్ వైపు చూస్తున్నాయి.

ఐటీతో పాటు గేమింగ్ రంగానికి ఉన్న భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని రాయదుర్గంలో ఇమేజ్ టవర్(Innovation in Multimedia, Animation, Gaming and Entertainment-IMAGE) నిర్మిస్తోంది. 16లక్షల చదరపు అడుగుల విస్తీరణంలో ఇది అందుబాటులోకి రాబోతోంది. రూ.945 కోట్లతో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్స్ 2023 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఐటీ, స్టార్టప్ కంపెనీలకు టీ-హబ్ కేరాఫ్ అడ్రస్ గా మారినట్లు.. గేమింగ్ ఇండస్ట్రీకి ఇమేజ్ టవర్స్ చిరునామాగా మారనుంది. ఇప్పటికే హైదరాబాద్ లో గేమింగ్ కంపెనీలు పని చేస్తున్నాయి.