Finger Millet : రాగిపంట సాగులో మెలుకువలు, తెగుళ్ళ నివారణ

పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం మరియు గింజలు రాకపోవడం వంటివి జరుగుతాయి.

Finger Millet : రాగిపంట సాగులో మెలుకువలు, తెగుళ్ళ నివారణ

Finger Millet (1)

Finger Millet : తెలుగు రాష్ట్రాల్లో రాగుల పంటను రైతులు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు. నీటి సదుపాయం తక్కువగా ఉన్న ప్రాంతంలో ఇది చాలా భాగా అనుకూలమైన పంట. చిరు ధాన్యాలలో రాగి ఎంతో ప్రాముఖ్యత ఉన్న పంట. ఉపయోగకరమైన పోషకవిలువలు కలిగిన ఈ పంటను పండించేందుకు రైతులు ఆసక్తి చూపిస్తున్నారు. ఖరిఫ్ లో వర్షాధారంగా ,యాసంగిలో ఆరుతడి పంటగా రాగిని సాగుచేసుకోవచ్చును. నీటి లభ్యత తగ్గినప్పుడు మరియు కొద్ది పాటి చౌడు సమస్య ఉన్న పరిస్థితులలో రాగి పంట సాగు ద్వారా మంచి దిగుబడులు పొందవచ్చును. అయితే రైతులు రాగి పంటను ఆశించే తెగుళ్ళ విషయంలో కొద్ది పాటి జాగ్రత్తలు పాటించటం ద్వారా పంటను కాపాడుకోవచ్చు.

రాగి సాగులో తెగుళ్ళు ;

పేనుబంక: పంట బెట్టకు గురైనపుడు చాలా ఉదృతంగా ఆశిస్తుంది. చిన్న మరియు పెద్ద పురుగులు ఆకు పచ్చ, నీలిరంగు కలిపిన వర్ణంలో ఉంటాయి. ఇవి ఆకులు మరియు కంకులు నుండి రసం పీలుస్తాయి. ఆశించిన మొక్కలలో పెరుగుదల తగ్గి మాడిపోయినట్లు కనిస్తాయి. పైరు చిన్న దశలో అసిస్తే కంకులు రాకపోవడం మరియు గింజలు రాకపోవడం వంటివి జరుగుతాయి. దీని నివారణకు డైమిథోయెట్ 2 మి. లీ లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మి. లీ లీటరు నీటిని కలిపి పిచికారి చేయాలి. తద్వారా దీనిని నివారించుకుని పంటను కాపాడుకోవచ్చు.

అగ్గి తెగులు: ఈ తెగులు నారు మడిలో సోకినప్పుడు లేత మొక్కలు మాడిపోతాయి. ఎదిగిన మొక్కల ఆకుల పై దారపు కండె ఆకారంలో మచ్చలు చుట్టూ ఎరుపు గోధుమ రంగు అంచులు ఉండి మధ్యలో బూడిద రంగు కల్గి ఉండును. కనుపుల మీద కూడా ఈ వ్యాధి నలుపు రంగు మచ్చల రూపంలో కనిపిస్తుంది. మెడ విరుపుగా ఆశించినప్పుడు కణుపు దగ్గర మొక్క విరిగిపోతుంది. వెన్నుపై ఆశించినప్పుడు ధాన్యపు గింజలు తాలు గింజలుగా మారుతాయి.

అధిక నత్రజని వాడటం వల్ల సైతం తెగులు ఎక్కువగా కనిపిస్తుంది. దీని నివారణకు తెగులును తట్టుకొనే రకాలను సాగుకు ఎంపిచేసుకోవాలి. 3 గ్రాముల థైరామ్ లేక కాప్టాన్ ను కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ది చేయాలి. మొక్కల పై మచ్చలు కనిపించిన వెంటనే కార్బముడిజిమ్ మందును లీటరు నీటికి 1 గ్రాము చొప్పున కలిపి పైరు పై పిచికారి చేయాలి.