Imran Khan commends India: అమెరికాకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి జైశంకర్‌ మాట్లాడిన వీడియో చూపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు

''రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ ను అమెరికా ఆదేశించింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి.. పాకిస్థాన్ కాదు. అయినప్పటికీ, భారత విదేశాంగ మంత్రి ఏం చెబుతున్నాడో వినండి. చమురు దిగుమతి చేసుకోవద్దని తమకు చెప్పడానికి మీరు ఎవరని అమెరికాకు జయశంకర్ నిలదీస్తున్నారు. రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొనుగోలు చేస్తోందని, తాము కూడా తమ ప్రజలకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటామని జయశంకర్ అన్నారు. స్వతంత్ర దేశం అంటే ఇది'' అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

Imran Khan commends India: అమెరికాకు వ్యతిరేకంగా కేంద్రమంత్రి జైశంకర్‌ మాట్లాడిన వీడియో చూపిస్తూ ఇమ్రాన్ ఖాన్ ప్రశంసల జల్లు

Imran Khan commends India

Imran Khan commends India: ఏ దేశ ఒత్తిళ్ళకూ లొంగకుండా కొనసాగుతోన్న భారత స్వతంత్ర విదేశాంగ విధానాన్ని పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ప్రశంసించకుండా ఉండలేకపోతున్నారు. అగ్రరాజ్యం అమెరికాపై భారత విదేశాంగ మంత్రి జై శంకర్ చేసిన వ్యాఖ్యల వీడియోను తమ దేశ ప్రజలకు చూపించి మరీ ఇమ్రాన్ ఖాన్ భారత విధానాలను ప్రశంసించారు. తాజాగా, లాహోర్ లో నిర్వహించిన ర్యాలీలో ఇమ్రాన్ ఖాన్ మాట్లాడుతూ.. ”పాకిస్థాన్ కు స్వాతంత్ర్యం వచ్చిన సమయంలోనే భారత్ కు స్వాతంత్ర్యం వచ్చింది. అయితే, భారత్ విదేశాంగ విధానంలో దృఢ నిశ్చయంతో స్వతంత్ర విధానాలతో ముందుకు వెళుతోంది. దేశ ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా విదేశాంగ విధానాలను అమలుపర్చుతోంది. మన దేశంలోని ప్రధాని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మాత్రం నిలకడలేని విధానాలను అవలంబిస్తోంది” అని ఇమ్రాన్ ఖాన్ వ్యాఖ్యానించారు.

”రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవద్దని భారత్ ను అమెరికా ఆదేశించింది. అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామి.. పాకిస్థాన్ కాదు. అయినప్పటికీ, భారత విదేశాంగ మంత్రి ఏం చెబుతున్నాడో వినండి. చమురు దిగుమతి చేసుకోవద్దని తమకు చెప్పడానికి మీరు ఎవరని అమెరికాను జైశంకర్‌ నిలదీస్తున్నారు. రష్యా నుంచి యూరప్ గ్యాస్ కొనుగోలు చేస్తోందని, తాము కూడా తమ ప్రజలకు అవసరమైన వాటిని దిగుమతి చేసుకుంటామని జైశంకర్‌ అన్నారు. స్వతంత్ర దేశం అంటే ఇది” అని ఇమ్రాన్ ఖాన్ అన్నారు.

రష్యా నుంచి చమురును కొనుగోలు చేయడంలో అమెరికా ఒత్తిడికి తమ దేశ ప్రధాని షెహబాబ్ షరీఫ్ లొంగిపోయారని ఆయన విమర్శలు గుప్పించారు. రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడానికి ప్రస్తుత పాక్ ప్రభుత్వానికి ధైర్యం లేదని అన్నారు. కాగా, ఇమ్రాన్ ఖాన్ గతంలోనూ భారత విదేశాంగ విధానంపై పలుసార్లు ప్రశంసలు కురిపించారు.


Dalit boy beaten to death: రాజస్తాన్ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసిన మాయావతి