సైరస్ మిస్రీకి షాక్..కార్పొరేట్ వార్ లో టాటాసన్స్ విజయం

టాటా గ్రూప్ వర్సెస్ సైరస్ మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి భారీ షాక్‌ తగిలింది. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలని గ‌తేడాది జ‌న‌వ‌రి 10న నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (NCLAT) ఇచ్చిన తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది.

సైరస్ మిస్రీకి షాక్..కార్పొరేట్ వార్ లో టాటాసన్స్ విజయం

In Big Win For Tata Sons Supreme Court Backs Removal Of Cyrus Mistry1

Tata Sonsటాటా గ్రూప్ వర్సెస్ సైరస్ మిస్త్రీ వివాదంలో సైరస్ మిస్త్రీకి భారీ షాక్‌ తగిలింది. టాటా గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌గా సైరస్‌ మిస్త్రీని తిరిగి నియమించాలని గ‌తేడాది జ‌న‌వ‌రి 10న నేషనల్‌ కంపెనీ లా అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ (NCLAT) ఇచ్చిన తీర్పును శుక్రవారం సుప్రీంకోర్టు కొట్టేసింది.

మిస్త్రీకి అనుకూలంగా ఎన్ సీఎల్ఏటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ టాటా సన్స్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన సర్వోన్నత న్యాయస్థానం..ఛైర్మన్‌గా మిస్త్రీ తొలగింపును సమర్ధిస్తూ NCLAT ఉత్తర్వులు రద్దుచేసింది .టాటా సన్స్‌లో అణచివేత, దుర్వినియోగంపై మిస్త్రీ వాదనలను సుప్రీంకోర్టు పరిగణనలోకి తీసుకోలేదు. మిస్త్రీకి అనుకూలంగా లా ట్రైబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను న్యాయస్థానం కొట్టివేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్దే నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం తీర్పు వెలువరించింది.

కాగా, 2016 అక్టోబ‌ర్‌లోటాటా స‌న్స్.. సైర‌స్ మిస్త్రీని చైర్మ‌న్ ప‌ద‌వి నుంచి తొల‌గించి, ఆయన స్థానంలో ఎన్ చంద్రశేఖరన్‌ను చైర్మన్ గా నియమించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం టాటా గ్రూప్‌ చైర్మన్‌గా ఎన్ చంద్రశేఖరన్‌ కొనసాగుతున్నారు. మిస్త్రీ తొలగింపుపై సుదీర్ఘ న్యాయపోరాటంలో టాటా గ్రూప్ విజయం సాధించింది. దీంతో కార్పొరేట్‌ వార్‌లో టాటాకు భారీ ఊరట లభించింది.

టాటా గ్రూపునకు అనుకూలంగా తీర్పు ఇవ్వడానికి చట్టంలోని అన్ని అంశాలూ బాధ్యత వహిస్తాయని మేం గుర్తించాం.. సైరస్ చేసిన విజ్ఞప్తులను కొట్టివేస్తున్నాం అని ఇవాళ సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, టాటా సన్స్‌లోని వాటాదారుల నుంచి మిస్త్రీ కుటుంబం నిష్క్రమణ అంశాన్ని మాత్రం కోర్టు వారి ఇష్టానికే వదిలేసింది. టాటా సన్స్‌లో తమ కుటుంబానికి ఉన్న 18.47 శాతం వాటాలను తీసుకోడానికి మిస్త్రీ ఇంతకు ముందు ప్రతిపాదన చేశారు.