హైదరాబాద్‌లో రూ. 1500కోట్ల స్కామ్!

హైదరాబాద్‌లో రూ. 1500కోట్ల స్కామ్!

హైదరాబాద్‌లోv భారీ స్కీమ్‌ స్కామ్‌ బయటపడింది. సామాన్య ప్రజల ఆశలను, ఆర్థిక అవసరాలను ఆసరాగా చేసుకొని.. ఓ బ్యాచ్‌ 15వందల కోట్లను సంచిలో నింపుకుంది. మల్టీలెవెల్ మార్కెటింగ్, ఆన్ లైన్ ట్రేడింగ్ పేరు చెప్పి.. కోట్లలో దోచేశారు.

భాగ్యనరం కేంద్రంగా మొదలైన మోసానికి సంబంధించిన నిందితుల ఆట కట్టించారు సైబరాబాద్‌ పోలీసులు. భారీ మనీ సర్క్యూలేషన్ స్కీమ్ స్కామ్‌ను.. సైబరాబాద్ ఎకనామకిల్ యపన్స్ వింగ్ బయటపెట్టింది. ఇండస్ వివా హెల్త్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ మోసానికి పాల్పడ్డట్లు గుర్తించారు పోలీసులు. దేశ వ్యాప్తంగా 10 లక్షల మందిని ముంచినట్లు తేల్చారు.

మనీ స్కీమ్ గ్యాంగ్ దాదాపు 15వందల కోట్ల రూపాయల డబ్బు వసూలు చేసినట్లు తెలుస్తోంది. కంపెనీ డైరెక్టర్స్ తోసహా 24 మంది ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. వివా సంస్థకు సంబంధించి 20 కోట్ల రూపాయలను ఫ్రీజ్‌ చేశారు అధికారులు.

2014లో ఇండస్‌ వివా హెల్త్‌ సైన్సెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ప్రారంభం అయింది. మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌ పేరుతో మోసానికి తెరలేపింది. చైన్‌ సిస్టమ్‌తో సింపుల్‌గా కోట్లను కొల్లగొట్టింది. ఏడాదికేడాది తమ వినియోగదారులను పెంచుకుంటూ పది లక్షల మందిని బుట్టలో వేసుకుంది.

వారి నుంచి 15 వందల కోట్లను దోచేసింది. చిన్న కంప్లైంట్‌తో ఎంట్రీ ఇచ్చిన పోలీసులు ఈ విషయాన్ని గుర్తించారు. కంపెనీ కార్యకలాపాలపై నిఘా పెట్టి ఈ బండారాన్ని బయటపెట్టారు. ఇలాంటి స్కీమ్‌ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సీపీ సజ్జనార్‌ సూచించారు.