Burqa Women: బుర్ఖాలో వచ్చి సెక్యూరిటీ క్యాంపుపై బాంబులు విసిరిన మహిళ

సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్ దగ్గరకు బుర్ఖాలో వచ్చిన మహిళ బాంబులతో దాడి చేసింది. ఈ ఘటన మొత్తం జమ్మూ అండ్ కశ్మీర్ లోని బరముల్లా జిల్లా సోపోర్ గ్రామంలో జరిగింది.

Burqa Women: బుర్ఖాలో వచ్చి సెక్యూరిటీ క్యాంపుపై బాంబులు విసిరిన మహిళ

Burqa Women: సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ క్యాంప్ దగ్గరకు బుర్ఖాలో వచ్చిన మహిళ బాంబులతో దాడి చేసింది. ఈ ఘటన మొత్తం జమ్మూ అండ్ కశ్మీర్ లోని బరముల్లా జిల్లా సోపోర్ గ్రామంలో జరిగింది. సీసీ కెమెరాలో రికార్డ్ అయిన వీడియో ప్రకారం.. రోడ్ మధ్యలో నిల్చొన్న మహిళ.. పర్సును ఓపెన్ చేసి అందులో ఉన్న బాంబును సీఆర్పీఎఫ్ క్యాంప్ మీదకు విసిరేసింది. ఆ తర్వాత అక్కడి నుంచి పరుగుతీసింది.

ఆ బ్యాంబు సెక్యూరిటీ క్యాంపు బయటి ప్రాంతంలోనే పడినట్లు పోలీసులు వివరించారు. దాని పట్ల ఎటువంటి నష్టం గానీ, గాయాలు కానీ జరగలేదని తెలిపారు. దాడి జరిగిన వెంటనే అలర్ట్ అయి జాగ్రత్త చర్యలు తీసుకున్నారు.

ఆమెను పట్టుకునేందుకు పెద్ద ఎత్తులో చర్యలు తీసుకుంటున్నామని పోలీసులు తెలిపారు. త్వరలోనే మహిళ ఆచూకీ కనిపెట్టి అరెస్ట్ చేస్తామని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్ వెల్లడించారు.

Read Also : బుర్ఖాలు..స్కార్ఫ్‌లపై నిషేధం