Mumbai : రూ.25 ల‌క్ష‌ల హోటల్ బిల్లు చెల్లించాలని బాత్రూం కిటికీ నుంచి ప‌రార్‌

ఓ వ్యక్తి స్టార్ హోటల్ లో దిగాడు.8 నెలలు దర్జాగా అన్ని భోగాలు అనుభవించాడు. బిల్లు రూ.25 లక్షలు అయ్యింది. బిల్లు కట్టాల్సి వస్తుందని బాత్రూమ్ కిటికీలోంచి దూకి పారిపోయాడు ప్రబుద్ధుడు

Mumbai : రూ.25 ల‌క్ష‌ల హోటల్ బిల్లు చెల్లించాలని బాత్రూం కిటికీ నుంచి ప‌రార్‌

Man Esman Escapes Bathroom Window Without Paying Rs 25 Lakh Bill

man escapes bathroom window without paying Rs 25 lakh bill: దర్జాగా హొటల్ కు రావటం,దర్జాగా గడపటం తరువాత అన్ని బిల్లులు ఎగ్గొట్టి పారిపోయిన ఘనలు చాలామందే ఉన్నారు. బిజినెస్ పనిమీద వచ్చాననీ..తానో పేద్ద శ్రీమంతుడినని అబద్దాలు చెప్పి వారాల తరబడి..నెలల తరబడి హోటల్ లో తిష్ట వేసి..ప్రూఫ్ ల కోసం ఫేక్ ఐడిలు చూపించి ఆనక..దొంగలాగా పారిపోవటం కొంతమంది అయితే వెళుతు..వెళుతు హోటల్ లో విలువైన వస్తువులు కూడా చక్కగా బ్యాగుల్లో సర్దేసుకుని చెక్కయటం జరుగుతుంటుంది.అదే చేశాడో ప్రబుద్ధుడు.

వారం రెండు వారాలు కాదు ఏకంగా 8 నెలల పాటు కొడుకుతో సహాయ హోటల్లో మకాం వేసాడు.చక్కగా తిన్నాడు.తిరిగాడు. హాయిగా అన్ని భోగాలు అనుభవించాడు. ఈ ఎనిమిది నెలల్లో డబ్బులు అడిగితే మొత్తం అంతా ఒకేసారి చెల్లించేస్తానని నమ్మించాడు.అలా రూ.25 లక్షల బిల్లు అయ్యాక చల్లగా కొడుకుతో సహా తాను ఉండే డీలక్స్ రూము బాత్రూమ్ కిటికి నుంచి దూకి పరారయ్యాడు.దీంతో బిత్తరపోయిన సదరు హోటల్ వారు పోలీసులకు ఫిర్యాదుచేయటంతో మహారాష్ట్ర‌లోని న‌వీముంబైలో జరిగిన ఈ బండారం బయటపడింది.

అది 2020 నవంబర్ 23. మహారాష్ట్ర‌లోని న‌వీముంబైలోని ఖర్గార్ ప్రాంతం. అక్క ఓ త్రీ స్టార్ హోటల్ మురళి కామత్ అనే 43ఏళ్ల వ్యక్తి తన 12 ఏళ్ల కొడుకుతో పాటు వచ్చాడు. రెండు డీలక్స్ రూములు బుక్ చేసుకున్నాడు. దాని కోసం హోటల్ వారు ఐడీ..అడ్వాన్స్ అడిగారు. దానికి మురళీ కామత్..నెల రోజుల త‌ర్వాత డిపాజిట్ చెల్లిస్తాన‌ని..అందుకు త‌న పాస్‌పోర్ట్‌ను హామీగా పెడ‌తాన‌ని చెప్పాడు. తాను సినీ ప‌రిశ్ర‌మ‌లో ప‌నిచేస్తానని హోట‌ల్ సిబ్బందికి చెప్పిన ఆయ‌న హోట‌ల్‌లో రెండు సూప‌ర్ డీల‌క్స్ రూమ్‌లు బుక్ చేశాడు. ఓ రూంలో తాను ఉంటాన‌ని, మ‌రో రూంలో త‌న ప‌నికి సంబంధించిన స‌మావేశాలు జ‌రుగుతాయ‌ని చెప్పాడు.పాస్ పోర్టే ఇచ్చాడు కదాని అనుకున్నారో ఏమోగానీ..రెండు డీలక్స్ రూములు ఇచ్చారు. అలా తన కొడుకుతో కలిసి ఎనిమిది నెలుగా ఉంటున్నాడు. దీంతో రూ .25 లక్ష‌ల బిల్లు అయ్యింది.

అలా వారాలు గడుస్తున్నా మురళి బిల్ చెల్లించేవాడు కాదు. హోటల్ సిబ్బంది అడిగితే ఏదో చెప్పేవాడు. అలా 2021 మే వ‌ర‌కూ మురళీ కామ‌త్ హోటల్ కు ఎటువంటి చెల్లింపులు చేయ‌లేదు. దీంతో హోటల్ సిబ్బంది పదే పదే బిల్ కట్టమని అడిగేవారు. మొత్తం బిల్ కట్టి రూమ్స్ ఖాళీ చేయమంటుండంతో మురళీ..బిల్ ఎగ్గొట్టటానికి గత జులై 17న త‌న కొడుకుతో పాటు బాత్రూం కిటికీ గుండా పారిపోయాడు. ఇది తెలుసుకున్న హోటల్ సిబ్బంది లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కామ‌త్ త‌న ల్యాప్‌టాప్‌, మొబైల్ పోన్‌ను రూంలోనే వ‌దిలివేసి వెళ్లిపోయాడు.మరి వాటిని పట్టుకెళ్లటం కుదరక వదిలేసుంటాడు బహుశా. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు.