Pregnant Women : వేసవిలో గర్భిణులు ఆరోగ్య విషయంలో!

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవటం అవసరం. ఉదయం, సాయంత్రం సమయంలో చల్లని నీటితో స్నానం చేయటం మంచిది.

Pregnant Women : వేసవిలో గర్భిణులు ఆరోగ్య విషయంలో!

Pregnant Women

Pregnant Women : వేసవి కాలంలో గర్భిణులు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. తల్లికి ఎలాంటి ఆనారోగ్య సమస్యలు తలెత్తినా అవి కడుపులోని పుట్టబోయే బిడ్డపైన ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. ఎండాకాలంలో సూర్యకిరణాలు నేరుగా పడకుండా జాగ్రత్త వహించాలి. ఉష్ణోగ్రతల అధికంగా ఉన్న సమయాల్లో తలనొప్పి, పాదాల వాపు, డీహైడ్రేషన్ బారిన పడే అవకాశాలు ఉంటాయి. ఉదయం సూర్యోదయానికి ముందు, సూర్యస్తమయానికి తరువాత మాత్రమే కొద్ది సేపు నడవటం మంచిది. కేవలం మంచానికే పరిమితం కాకుండా వైద్యులు సూచించిన వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయాలి.

ఉక్కపోత, చెమట కారణంగా అనేక సమస్యలు తలెత్తుతాయి. శరీరంలో డీహైడ్రేషన్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వేసవిలో వేడి ప్రభావం పెరుగుతున్న కొద్దీ ఆహారపు అలవాట్లను మార్చుకోవాలని గర్భిణీలకు వైద్యులు సూచిస్తున్నారు. అన్ని రకాల మసాల వేపుళ్లకు దూరంగా ఉండాలి. కార్బోహైడ్రేట్లు, పోషకాలను ఎక్కువగా ఉండే తాజా కూరగాయలు, పండ్లను తినాలి. నీటి పరిమాణం తగ్గకుండా చూసుకోవాలి. కాసి వడపోసి చల్లారిన తరువాత మాత్రమే నీటిని తాగాలి. వేసవిలో వచ్చే కర్భూజ, పుచ్చకాయ వంటివి తీసుకోవాలి.

గర్భిణులు దుస్తుల విషయంలో ఫ్యాషన్లకు పోకుండా ఉండటమే మేలు. బయటకు వెళ్ళేసమయంలో స్కార్ఫ్ కట్టుకోవటం మంచిది. సాధ్యమైనంత వరకు ఎండలోకి వెళ్ళకపోటమే ఉత్తమం. పొడవాటి జుట్టు ఉంటే చిన్నగా కత్తిరించుకోవటం మంచిది. శ్వాసకు ఇబ్బంది కలగకుండా ఉండేలా ప్రసూతి గౌన్లు, నైటీలు లాంటివి వేసుకోవాలి. బిగుతుగా ఉండే దుస్తులను ధరించరాదు. గర్భదారణ సమయంలో తినే ఆహారంలో తప్పకుండా జాగ్తత్తలు తీసుకోవాలి. ఆసమయంలో తినే ఆహారమే శిశువుకు ప్రధాన పోషకాలహారంగా ఉంటుంది. తీసుకునే ఆహారంలో ప్రొటీన్లు, కొవ్వు, కార్బోహైడ్రేట్లు, ఇనుము, ఫోలిక్ ఆమ్లం, కాల్షియం, విటమిన్లతో సహా అన్ని పోషకాలు ఉండాలి.

వేసవిలో అధిక ఉష్ణోగ్రతలకు అనుగుణంగా శరీరాన్ని చల్లగా ఉంచుకోవటం అవసరం. ఉదయం, సాయంత్రం సమయంలో చల్లని నీటితో స్నానం చేయటం మంచిది. వేసవి కాలంలో తినే ఆహారాన్ని ఒకేసారి అధిక మొత్తంలో కాకుండా కొద్ది మొత్తంలో తరచుగా తీసుకోవటం మంచిది. హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా, గర్భధారణ సమయంలో చర్మం కొన్ని సమస్యలను ఎదుర్కొంటుంది. ముఖ్యంగా వేసవిలో చర్మ సంరక్షణకు మంచి హైడ్రేషన్ ,మంచి పోషకాహారం అవసరం. చర్మాన్ని నూనె లేదా క్రీములను అప్లై చేసుకోవటం మంచిది. డెడ్ స్కిన్‌ని తొలగించడానికి, చర్మాన్ని పోషణ చేయడానికి మాస్క్ లేదా స్క్రబ్‌ని ఉపయోగించాలి.