Yuvika Chaudhary: అనుచిత వ్యాఖ్యలు.. నటిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు!

బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ యువికా చౌదరి నిమ్న వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. మే 25న యువికా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది.

Yuvika Chaudhary: అనుచిత వ్యాఖ్యలు.. నటిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు!

Yuvika Chaudhary

Yuvika Chaudhary: బాలీవుడ్ నటి, బిగ్ బాస్ బ్యూటీ యువికా చౌదరి నిమ్న వర్గాలపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో కేసు నమోదైంది. మే 25న యువికా తన సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో షేర్ చేసింది. అందులో షెడ్యూల్ కులాల వారిని కించ పరిచే విధంగా మాట్లాడింది. దీంతో ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కాగా.. దళిత వర్గాలు, నిమ్న వర్గాల ప్రజలు ఆమెపై ఆగ్రహం చేశారు. తమని కించపరిచేలా మాట్లాడిన నటి యువికాను వెంటనే అరెస్టు చేయాలంటూ డిమాండ్ చేస్తూ దళిత సామాజిక కార్యకర్త రాజత్ కల్సన్ యువికాపై హర్యానా పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దీంతో శుక్రవారం సాయంత్రం షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల చట్టం కింద పోలీసులు నటి యువికాపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు ఒక అధికారి తెలిపారు. అయితే యువికా ఇదే విషయంపై నెటిజన్లకు క్షమాపణలు కూడా చెప్పింది. ఒక వర్గం వారిని కించపరిచేలా ఉన్న పదాలను పొరపాటున ఉపయోగించానని తెలిపిన యువికా తనను క్షమించమంటూ సోషల్ మీడియాలో వేడుకుంది. అయితే.. అప్పటికే ఈ విషయంలో సైబర్ సెల్ ద్వారా అధికారిక దర్యాప్తు పూర్తై.. హన్సీనగర పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. మరి ఇప్పుడు యువికా ఈ కేసు నుండి ఎలా బయటపడుతుందో చూడాలి.

కాగా.. యువికా చౌదరి బాలీవుడ్ లో పలు సినిమాలతో పాటు.. బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో పార్టిసిపెంట్ గా పాల్గొని అలరించింది. ఇక, బుల్లితెర మీద కూడా ఎన్నో షో లలో మంచి క్రేజ్ ను అందుకుంది. ఫిర్ భి దిల్ హై హిందుస్తానీ, ఓం శాంతి ఓం సినిమాలలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్న ఈ నటి సోషల్ మీడియాలో యమా యాక్టివ్ గా ఉంటూ ఫాలోవర్లను పెంచుకుంటుంది. అయితే.. కావాలనే చేసిందో లేక సందర్భానుసారం చేసిందో కానీ నిమ్నవర్గాలపై నోరుజారి ఇలా చిక్కులు తెచ్చుకుంది.