Wheat Grass : గోధుమ గడ్డితో లక్షల ఆదాయం..

ఇంట్లోనే దీనిని సులభంగా పెంచేందుకు అవకాశం ఉంది. నాణ్యమైన గోధుమలను సేకరించి వాటిని ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టాలి.

Wheat Grass : గోధుమ గడ్డితో లక్షల ఆదాయం..

Wheat Grass

Wheat Grass : గోధుమ గడ్డి జ్యూస్ ఇటీవలికాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ జ్యూస్ తీసుకుంటే వెలకట్టలేని ఆరోగ్య ప్రయోజనాలు ఉండటమే ఇందుకు కారణం. రోగనిరోధక శక్తి పెరగటంతోపాటు ఇతర ఆరోగ్య ప్రయోజనాలుండటంతో గోధుమ గడ్డి జ్యూస్ తోపాటు, పొడిని వినియోగించే వారి సంఖ్య క్రమేపి పెరుగుతుంది.

గోధుమలు విత్తిన తరువాత ఆరు నుండి ఎనిమిది అంగుళాల పొడవైన గడ్డి తీసుకుని దానిని నుండి రసాన్ని తీస్తారు. అందులో మెగ్నీషియం, క్లోరోఫిల్, కాల్షియం, అయెడిన్ , సెలీనియం, జింక్, ఐరన్ ,ఫైబర్, విటమిన్ కె, విటమిన్ బి, సి, ఇ వంటి పోషకాలు ఎక్కవగా లభిస్తాయి. గోధుమ గడ్డి దొరకని వారు గోధమ గడ్డి పొడిని ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం గోధుమ గడ్డి జ్యూస్ తోపాటు, గోధుమ గడ్డి పౌడర్లు మార్కెట్లో అందుబాటులోకి వచ్చాయి.

గోధుమ గడ్డి జ్యూస్ తాగటం వల్ల రక్తహీనతను పోగొడుతుంది. అధిక బరువును నియంత్రించటంతోపాటు, జీర్ణక్రియకు బాగా ఉపకరిస్తుంది. పేగుల్లో వచ్చే అల్సర్ మంటను నివారించటంతోపాటు, చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. ఎన్నో రకాల ప్రయోజనాలుండటంతో ఇటీవలికాలంలో చాలా మంది తమ ఇంట్లోనే గోధుమ గ్రాస్ ను పెంచుతూ విక్రయిస్తున్నారు. ప్రస్తుతం ఇది ఒక లాభసాటి వ్యాపారంగా మారింది. గోధుమ జ్యూస్ తోపాటు, పౌడర్ ను తయారు చేసి మార్కెట్లో విక్రయించవచ్చు.

ఇంట్లోనే దీనిని సులభంగా పెంచేందుకు అవకాశం ఉంది. నాణ్యమైన గోధుమలను సేకరించి వాటిని ఎనిమిది గంటల పాటు నీటిలో నానబెట్టాలి. అనంతరం కాటన్ వస్త్రంలో చుట్టి ఉంచితే రెండురోజుల్లో మొలకలు వస్తాయి. మొలకలు వచ్చిన గోధుమలను మట్టితో నింపిన ట్రేలలో చల్లుకుని నీడప్రదేశంలో ఉంచాలి. రోజు తగినంత నీరు చిలకరిస్తుంటే 10 రోజుల వ్యవధిలో 8అంగుళాలకు గడ్డి పెరుగుతుంది.

అనంతరం ఆగడ్డిని కోసి 2రోజులపాటు నీడలోనే ఆరబెట్టాలి. బాగా డ్రైఅయ్యాక మిక్సీలో వేసి పౌడర్ తయారు చేయాలి. గాలి తగలకుండా ప్యాక్ చేసి ఏంచక్కా మెడికల్ షాపుల్లో , కిరాణా షాపుల్లో విక్రయించుకోవచ్చు. ప్రస్తుతం మార్కెట్లో కిలో గోధుమ గడ్డి పౌడర్ 1500రూపాయలు పలుకుతుంది. ఎక్కవ మొత్తంలో గోధమ గడ్డి పెంచుకుంటే నెలకు 25వేల నుండి 30వేల వరకు అదాయాన్ని పొందవచ్చు. ఎక్కవ స్ధలం అందుబాటులో ఉన్న వాళ్ళు, తక్కువ అదాయంతో గోధుమ గడ్డి పెంపకం చేపడితే లక్షలు సంపాదించవచ్చు.