Income Tax Raids In Hyderabad : హైదరాబాద్‌లో ఐటీ దాడులు

ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు  హైదరాబాద్‌లోని  10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు.

Income Tax Raids In Hyderabad : హైదరాబాద్‌లో ఐటీ దాడులు

IT Raids :  ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ రోజు  హైదరాబాద్‌లోని  10 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్  కేంద్రంగా వ్యాపారం  నిర్వహిస్తున్న ట్రై కలర్స్ ప్రాపర్టీస్ రియల్ ఎస్టేట్ సంస్ధకు చెందిన కార్యాలయాల్లో ఈ సోదాలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 10 ప్రాంతాల్లో జరుగుతుండగా.. దేశంలోని ముంబై,పాట్నా,ఢిల్లీ,బెంగళూరు,చెన్నైతో సహా పలు పట్టణాల్లోని 6 ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

హైదరాబాద్ లో శరద్ ఋతువు ఎక్స్ కోటిక , రైజింగ్ కోర్టీ యాడ్ పేరుతో రీయల్ ఎస్టేట్ వెంచర్స్..ముంబై లో ఆస్కార్ వ్యాలీ, బీహార్ ధర్బంగా లో ఇంపిరియల్ పార్క్, బెంగుళూరు లో కోగ్రౌ, పాట్నా లో స్ప్రింగ్ ఫీల్డ్ టౌన్ షిప్ పేరుతో ట్రై కలర్ సంస్థ పలు ప్రాజెక్టు లు చేపట్టింది. ఇవికాక   ట్రై కలర్స్ సంస్ధ విదేశాల్లో సైతం పెద్ద ఎత్తున ప్రాపర్టీ బిజినెస్ చేస్తోంది. ఈ సోదాలలో ఐటీ అధికారులు పెద్ద ఎత్తున నగదు గుర్తించినచట్లు సమాచారం. సోదాలు కొనసాగుతున్నాయి.

మరోవైపు తమిళ సినీ నిర్మాత, ఫైనాన్షియర్ అన్బు చెజియన్‌కు సంబంధించి చెన్నై, మధురై లోని కార్యాలయాలు, ఇళ్లు, అతని వద్ద పైనాన్స్ తీసుకున్న నిర్మాతలు, హీరోలకు చెందిన సుమారు 40 చోట్ల నిన్న ఆదాయపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. అన్బు చెజియన్ కు చెందిన 20 ప్రాంతాల్లో ఈరోజు కూడా దాడులు కొనసాగుతున్నాయి.

Also Read :Tamil Film Industry : తమిళ సినీ నిర్మాతల ఇళ్లపై ఐటీ దాడులు