Auto Motive : పెరిగిన వాహనాల డిమాండ్… పుంజుకున్న ఆటో మొబైల్ రంగం

సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల పెరుగుదల, కంటైనర్ల ధరలు, లాజిస్టిక్స్ ఇబ్బందులు వెరసి పరిశ్రమ ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు అడ్డంకులుగా మారాయన్నారు.

Auto Motive : పెరిగిన వాహనాల డిమాండ్… పుంజుకున్న ఆటో మొబైల్ రంగం

Acma

Auto Motive : వాహనాల డిమాండ్ పెరగటంతో ఆటోమొబైల్ రంగంలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఒకవైపు ముడిసరుకుల ధరల పెరుగుదల, మరోవైపు లాజిసిక్ట్ ఆటుపోట్ల నేపధ్యంలో దేశీయంగా ఉన్న ఆటో మొబైల్ పరిశ్రమ ఇప్పుడిప్పుడే కోలుకుంటోంది. ప్రస్తుతం ఆటో పరిశ్రమ భవిష్యత్తు ఆశాజనంగా మారిందని ఆటోమోటివ్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఏసీఎంఏ) స్పష్టం చేసింది. అయితే ఈ ఆర్ధిక సంవత్సరంలో అంతా బాగుంటుందన్న అంచనాల్లో ఉన్నప్పటికీ ఇదంతా థర్డ్ వేవ్ పై అధారపడి ఉంటుందని ఏసీఎంఏ అధ్యక్షుడు దీపక్ జైన్ తెలిపారు.

ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమలో 60 నుండి 70శాతం సామర్ధ్య వినియోగం ఉన్నప్పటికీ ఉద్యోగుల పరిస్ధితి స్ధిరంగా ఉందన్నారు. పరిశ్రమ వ్యయాల తగ్గింపు , స్ధానికీకరణ వంటి చర్యలను చేపడుతున్నట్లు చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో పరిశ్రమ 3శాతం క్షీణతతో 3.40లక్షల కోట్ల టర్నోవర్ కు చేరిందన్నారు.

సెమీకండక్టర్ల లభ్యత, ముడిసరుకుల ధరల పెరుగుదల, కంటైనర్ల ధరలు, లాజిస్టిక్స్ ఇబ్బందులు వెరసి పరిశ్రమ ఒడిదుడుకుల నుండి బయటపడేందుకు అడ్డంకులుగా మారాయన్నారు. ప్రస్తుతం పరిశ్రమ పుంజుకుంటుండటంతో, నిన్నటి వరకు ఆలోచనలో పడ్డ ఇన్వెస్టర్లు తిరిగి పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమౌతున్నారన్నారు.

కోవిడ్ కారణంగా ఏర్పడిన పరిస్ధితులతో ఆటో మొబైల్ పరిశ్రమ బిలియన్ డాలర్ల పెట్టుడులను కోల్పోయిందన్నారు. స్ధానిక తయారీపై దృష్టిపెడితే తక్కువ దిగుమతి సుంకాలు కోరుతున్న టెస్లాకు ఏసీఎంఏ మద్దతు ఇస్తుందని అధ్యక్షుడు దీపక్ జైన్ పేర్కొన్నారు. 75శాతం స్ధానికులకే ఉద్యోగ రిజర్వేషన్లు అమలు చేస్తూ హర్యానా తీసుకున్న నిర్ణయం పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపిస్తుందన్నారు.