పెరిగిపోతున్న పేడ దొంగతనాలు..! మహిళల నుంచి భారీస్థాయిలో పేడ స్వాధీనం!

పెరిగిపోతున్న పేడ దొంగతనాలు..! మహిళల నుంచి భారీస్థాయిలో పేడ స్వాధీనం!

Increasing Cow Dung theft in Chchattishgarh :  ఎవరన్నా దొంగతనాలు చేస్తే బంగారం, వెండీ, డబ్బులు లేదా వాహనాలు దొంగతనాలు చేస్తారు. కానీ పేడను దొంగిలించటం గురించి ఎప్పుడన్నా విన్నారా? చత్తీస్‌గఢ్ మాత్రం అదే జరుగుతోంది. ఇటీవల కాలంలో పేడను దొంగిలించటం బాగా పెరిగిపోయిందట..దీంతో పోలీసులు పేడ దొంగతనాలు చేసేవారిపై ఓ కన్ను వేయగా ఐదుగురు మహిళలు దొరికారు. వారి నుంచి 45 కేజీల పేడను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు..!!

చత్తీస్‌గఢ్ లో ఈ ఆవుపేడ దొంగతనాలు పెరగటానికి కారణమేమంటే..గత సంవత్సరం చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం గౌ-దాన్ న్యాయ యోచన పథకం ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం ప్రజల నుంచి పేడను కొంటోంది. కిలో ఆవుపేడకు రెండు రూపాయల చెల్లిస్తోంది. దీంతో పేడ దొంగతనాలు పెరుగుతున్నాయి. కాగా..ప్రజలనుంచి కొనుగోలు చేసిన పేడను గౌ-దాన్ కేంద్రం వద్ద స్టోర్ చేస్తోంది. పేడ దొంగతనాలు పెరగటంతో అధికారులు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటు చేసేలా పేడ దొంగతనాలు పెరిగాయి అంటే ఆవు పేడ డిమాండ్ ఎంతగా ఉందో ఊహించుకోవచ్చు..

కాగా..చత్తీస్‌గఢ్ ప్రభుత్వం 2020లో గౌ-దాన్ న్యాయ యోజన పథకాన్ని ప్రకటించింది. ఇందులో భాగంగా కిలో ఆవు పేడను రెండు రూపాయలకు కొనుగోలు చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభుత్వ ప్రకటన తర్వాత పేడకు ఎక్కడలేని డిమాండ్ వచ్చేసింది. పేడకు డిమాండ్ పెరగడంతో దొంగతనాలు కూడా అంతేస్థాయిలో పెరిగాయి. దీంతో పేడను కాపాడుకోవడానికి ఎవరికివారు సీసీటీవీ కెమెరాలు కూడా ఏర్పాటు చేసుకుంటున్నారు.

తాజాగా, అంబికాపూర్ మునిసిపాలిటీలో ప్రభుత్వ గౌ-దాన్ కేంద్రం నుంచి ఆవు పేడను దొంగిలిస్తూ ఐదుగురు మహిళలు పట్టుబడ్డారు. వారి నుంచి 45 కేజీల పేడను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. పెరిగిపోతున్న పేడ దొంగతనాలను అరికట్టేందుకు గౌ-దాన్ కేంద్రం వద్ద సీసీ కెమెరాల ఏర్పాటుకు అధికారులు రెడీ అవుతున్నారు. అంతేకాదు, పేడను కాపాడేందుకు అక్కడ కాపలా కూడా పెట్టాలని నిర్ణయించారు.