Indie Video Games: గేమ్ లవర్స్ హృదయాలను గెలుచుకున్న 5 వీడియో గేమ్స్!

వీడియో గేమ్స్.. పురాణాలు, బెస్ట్ బుక్స్ నుండి కామిక్స్ వరకు సాహిత్యం నుండి సంగీతం వరకు ఏదైనా గేమ్స్ కు కాదు అనర్హం అనేలా ఈ గేమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ గేమ్స్ లో అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్.. ఇంటెన్సివ్ ఫీల్ తో అద్భుతమైన గేమ్ ఫీల్ ను అందిస్తున్నాయి. గేమింగ్ లవర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా ఆడి ఆ థ్రిల్ ఆస్వాదించాల్సిన టాప్ ఫైవ్ గేమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Indie Video Games: గేమ్ లవర్స్ హృదయాలను గెలుచుకున్న 5 వీడియో గేమ్స్!

Incredible Indie Video Games 5 Video Games To Win The Hearts Of Game Lovers

Incredible Indie Video Games: వీడియో గేమ్స్.. ఒకప్పుడు ఇది కొన్ని ప్రత్యేక సెంటర్స్ లలో లభించే ఒక టైం పాస్ కాగా.. ఇప్పుడు పిల్లల నుండి వృద్ధుల వరకు కొందరికి ఇది ఒక వ్యసనంగా మారిపోయింది. వీడియో గేమ్స్ కోసం.. వాటిని మరింత ఆసక్తికరంగా, ఆహ్లదకరంగా మార్చేందుకు టెక్నాలజీలో సాధనాలు అనేకం పుట్టుకొచ్చాయి. వీటిని తమ ఇళ్లలో ప్రత్యేకంగా గదులను కేటాయించుకొనే వరకు వచ్చిన ఈ యుగంలో గేమ్ మేకర్స్ కూడా థ్రిల్ కలిగించే ఫీచర్స్ తోపాటు స్టోరీ లైన్ గేమ్స్.. ఉత్సాహభరిత ట్విస్టులతో కూడా గేమ్స్ రూపొందిస్తున్నారు. పురాణాలు, బెస్ట్ బుక్స్ నుండి కామిక్స్ వరకు సాహిత్యం నుండి సంగీతం వరకు ఏదైనా గేమ్స్ కు కాదు అనర్హం అనేలా ఈ గేమ్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ గేమ్స్ రూపొందించే వారిలో ప్రపంచస్థాయి స్టూడియో కంపెనీల నుండి పది పదిహేను మందితో నడిచే చిన్న చిన్న స్టార్ట్అప్స్ వరకు ఉండగా ఈ గేమ్స్ లో అత్యున్నత స్థాయి గ్రాఫిక్స్.. ఇంటెన్సివ్ ఫీల్ తో అద్భుతమైన గేమ్ ఫీల్ ను అందిస్తున్నాయి. గేమింగ్ లవర్స్ తమ జీవితంలో ఒక్కసారైనా ఆడి ఆ థ్రిల్ ఆస్వాదించాల్సిన టాప్ ఫైవ్ గేమ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1. హోల్లో నైట్ గేమ్

Incredible Indie Video Games

Incredible Indie Video Games

టీం చెర్రీ యొక్క అద్భుతమైన సృష్టిగా చెప్పుకొనే ఈ గేమ్ నోయిర్-ఆర్ట్ స్టైల్ 2డి మెట్రోయిడ్వేనియాతో రూపొందించిన యాక్షన్ అడ్వెంచర్. ఈ గేమ్ మిమ్మల్ని ఒక రాజ్యానికి తీసుకుపోయిన ఫీల్ తో పాటు హలోవానెస్ట్ రాజ్యంలో ప్రయాణిస్తున్న అనుభూతినిస్తుంది. ఇందులో గేమ్ ఆడేవారిని ఒక చీకటి ప్రపంచంలోకి తీసుకెళ్లి రాజ్యాన్ని ఛేదించే ఫీల్ తో పాటు ఒక పోరాటపటిమను పెంచే విధంగా సాగుతుంది. ఇది క్లాసిక్ మెట్రోడ్వానియా అడ్వెంచర్ కాగా.. ఈ గేమ్ అవార్డులను కూడా దక్కించుకుంది. ప్రస్తుతం మేకర్స్ ఈ గేమ్ సీక్వెల్ పనిలో ఉన్నారు.

గేమ్ అందుబాటులో ఉన్న ప్లాట్‌ఫామ్స్: పిసి, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, నింటెండో స్విచ్

2. అండర్ టేల్

Incredible Indie Video Games

Incredible Indie Video Games

టెమ్మీ చాంగ్ రూపొందించి, టోబి ఫాక్స్ అనే వ్యక్తి చేత అభివృద్ధి చేయబడిన ఈ గేమ్ 2015 మాస్టర్ క్లాస్ గేమ్ గా పేరు తెచ్చుకుంది. బిట్ స్టైల్ విజువల్స్ తో గేమ్ మొదలైన నుండి వివిధ భూతాలను కలుసుకునే పిల్లవాడు భూగర్భ ప్రపంచంలోకి వెళ్తే ఎలా ఉంటుందనే విధంగా ఈ గేమ్ సాగుతుంది. గేమ్ లో డైలాగ్స్, ప్యాట్రన్ గేమ్ లవర్స్ కు సూపర్బ్ కిక్ ఇస్తుంది. గేమర్ ఎంచుకొనే ఆప్షన్స్ వలన గేమ్ రసవత్తరంగా సాగుతుండగా ఇది ఒక లోకంలోకి గేమర్ ను తీసుకెళ్లి అందులో ఆటతీరును బట్టి హీరోగా నిలబెడుతుంది. 1 మిలియన్ పైన డౌన్ లోడ్స్ సాధించిన ఈ గేమ్ 6 సంవత్సరాల తరువాత Xbox కన్సోల్‌లకు రావడంతో Xbox గేమర్స్ పండగ చేసుకున్నారు.

ప్లాట్‌ఫామ్స్: పిసి, ప్లేస్టేషన్ 4, ప్లేస్టేషన్ వీటా, ఎక్స్‌బాక్స్ వన్, ఎక్స్‌బాక్స్ సిరీస్ ఎక్స్ | ఎస్, నింటెండో స్విచ్

3. మై ఫ్రెండ్ పెడ్రో

Incredible Indie Video Games

Incredible Indie Video Games

ఈ 2డి షూట్ అప్ గేమ్ సరికొత్త అనుభూతులతో గేమ్ లవర్స్ హృదయాలను గెలుచుకుంది. ఆకట్టుకునే ఆర్కేడ్ లాంటి గేమ్ తో కూల్ అనేలా గేమర్స్ కోసం సరికొత్త స్థాయికి తీసుకెళ్లగలిగింది. డెవలపర్లు గొప్ప మెటాక్రిటిక్ సమీక్షలతో రాసుకున్న ఈ గేమ్ 2డి సైడ్ స్క్రోలింగ్ యాక్షన్-గేమ్ గా గన్స్‌లింగర్ శబ్దాలతో సినిమాలను కూడా అసూయపడేలా చేస్తుందని గేమర్స్ చెప్తుంటారు. యాక్షన్ గేమ్ లవర్స్ కేవలం 10 సెకన్ల గేమ్‌ప్లేలోనే దీనికి లాక్ అయిపోతారని డెవలపర్స్ చెప్పగా గేమ్ స్టార్టింగ్ నుండే తనను రాను రక్షింపబడే భావనలో ఎత్తులకు పై ఎత్తులు వేసి కురిపించే బుల్లెట్ల వర్షం మరింత థ్రిల్లింగ్ అనిపిస్తుంది.

ప్లాట్‌ఫామ్స్: పిసి, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, నింటెండో స్విచ్

4. అన్ టైటిల్డ్ గూస్ గేమ్

Incredible Indie Video Games

Incredible Indie Video Games

ఇది చూసేందుకు సింపుల్ గేమ్ గా రూపొందించగా ఆడేవారికి థ్రిల్లింగ్ లో మాత్రం గ్రేట్ ఫీల్ ఇస్తుంది. రైతు, ఓ పిల్లవాడు గేమ్ లో పాత్రలుగా ఉండగా.. కాస్త చిలిపి పనులు.. అందుకు తగ్గ సంగీతం.. గేమర్ కు సరికొత్త అనుభూతిని ఇస్తుంది.

ప్లాట్‌ఫామ్స్: పిసి, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, నింటెండో స్విచ్

5. సెలెస్ట్

Incredible Indie Video Games

Incredible Indie Video Games

సెలెస్ట్ గేమ్ ఉత్తమ ఇండీ గేమ్ అవార్డు 2018లో గేమ్ ఆఫ్ ది ఇయర్ కొరకు నామినేట్ అయి.. సెలెస్ట్ చరిత్రలో గొప్ప ఇండీ ఆటలలో ఒకటిగా నిలిచింది. ఈ మాస్టర్ గేమ్ ఒక భావోద్వేగ కథ ద్వారా మిమ్మల్ని ఆటలోకి తీసుకెళ్ళగా చీకటిని ఎదుర్కొంటున్నప్పుడు సెలెస్ట్ పర్వతాన్ని అధిరోహించడానికి ప్రయత్నం చేయడం వంటివి గేమర్ మానసిక ఆరోగ్యంతో పోరాటాల అందమైన వర్ణనగా కనిపిస్తుంది. సెలెస్ట్ చాలా వరకు నిరాశపరిచే ఆటగా మొదలై.. ఆ పోరాటం తెలియకుండానే ఆటగాళ్లకు శక్తివంతమైన జీవిత పాఠంగా ముగుస్తుంది.

ప్లాట్‌ఫామ్స్: పిసి, ప్లేస్టేషన్ 4, ఎక్స్‌బాక్స్ వన్, నింటెండో స్విచ్, స్టేడియా