IndVsEng 3rd T20 : రెచ్చిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ ముందు బిగ్ టార్గెట్

చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ ధాటిగా ఆడాడు.(IndVsEng 3rd T20)

IndVsEng 3rd T20 : రెచ్చిపోయిన ఇంగ్లండ్ బ్యాటర్లు.. భారత్ ముందు బిగ్ టార్గెట్

Indvseng 3rd T20

IndVsEng 3rd T20 : చివరి టీ20 మ్యాచ్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్ చెలరేగిపోయారు. భారత బౌలర్లను ఎడాపెడా బాదేశారు. పరుగుల వరద పారించారు. డేవిడ్ మలాన్ హాఫ్ సెంచరీతో విరుచుకుపడగా, లియామ్ లివింగ్ స్టోన్ రెచ్చిపోయాడు.

డేవిడ్ మలాన్ (39 బంతుల్లో 77 రన్స్), లియామ్ లివింగ్ స్టోన్ (29 బంతుల్లో 42 పరుగులు) ధాటిగా ఆడంతో ఇంగ్లండ్ భారీ స్కోరు సాధించింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 215 పరుగులు చేసింది. మలాన్ స్కోరులో 6 ఫోర్లు, 5 భారీ సిక్సులు ఉన్నాయి. లివింగ్ స్టోన్ 4 సిక్సులు బాదాడు. ఆఖర్లో హ్యారీ బ్రూక్ ( 9 బంతుల్లో 19 పరుగులు 3 ఫోర్లు), క్రిస్ జోర్డాన్ (3 బంతుల్లో 11 పరుగులు 1 ఫోర్, 1 సిక్స్) మెరుపు ఇన్నింగ్స్ ఆడారు.(IndVsEng 3rd T20)

India vs England: టీమిండియా డ్రెస్సింగ్ రూమ్‌లో క‌న‌ప‌డి ఆశ్చ‌ర్య‌ప‌ర్చిన ధోనీ

నామమాత్రమైన ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు జేసన్ రాయ్ (27), జోస్ బట్లర్ (18) తొలి వికెట్ కు 31 పరుగులు జోడించారు. బట్లర్ ను అవేష్ ఖాన్ బౌల్డ్ చేయడంతో ఇంగ్లండ్ తొలి వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత జేసన్ రాయ్ ని ఉమ్రాన్ మాలిక్ ఔట్ చేశాడు. అయితే, మలాన్, లివింగ్ స్టోన్ జోడీ టీమిండియా బౌలింగ్ ను ఊచకోత కోసింది. ముఖ్యంగా, మలాన్ విజృంభణకు టీమిండియా బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. భారత బౌలర్లలో రవి బిష్ణోయ్, హర్షల్ పటేల్ చెరో రెండు వికెట్లు తీశారు. అవేష్ ఖాన్, ఉమ్రాన్ మాలిక్ తలో వికెట్ పడగొట్టారు. అందరికన్నా ఎక్కువగా స్పీడ్ గన్ ఉమ్రాన్ మాలిక్ పరుగులు ఇచ్చుకున్నాడు. 4 ఓవర్లలో 56 రన్స్ ఇచ్చాడు.

T20 team: భార‌త్‌కు ‘ప‌వ‌ర్ హౌస్‌’లాంటి క్రికెట్ జ‌ట్టు ఉంది: ఆష్లీ జిలెజ్

216 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. 1 పరుగు మాత్రమే చేసిన రిషబ్ పంత్… టాప్లే బౌలింగ్ లో బట్లర్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఆ తర్వాత జట్టు స్కోర్ 13 పరుగుల వద్ద భారత్ రెండో వికెట్ ను(విరాట్ కోహ్లి-11), 31 పరుగుల వద్ద మూడో వికెట్ ను(రోహిత్ శర్మ-11) కోల్పోయి కష్టాల్లో పడింది.(IndVsEng 3rd T20)

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

కాగా.. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా 2-0 తేడాతో ఇప్పటికే కైవసం చేసుకుంది. తొలి రెండు మ్యాచుల్లో ఘన విజయంతో కప్పును కైవసం చేసుకుంది. మూడో మ్యాచ్ లోనూ నెగ్గి సిరీస్ ను క్లీన్ స్వీప్ చేయాలని టీమిండియా పట్టుదలగా ఉంది. వరుసగా రెండు ఓటములు ఎదురవడంతో ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని అటు ఇంగ్లండ్ కూడా కసిగా ఉంది.

Virat Kohli : కోహ్లీపై కపిల్‌ దేవ్ షాకింగ్ కామెంట్స్.. జట్టులో విరాట్‌ను ఎందుకు తప్పించకూడదు..!