Publish Date - 7:51 pm, Thu, 25 February 21
టీమిండియాతో జరుగుతున్న పింక్ బాల్ టెస్టులో ఇంగ్లండ్ 38 ఏళ్ల తర్వాత చెత్త రికార్డు క్రియేట్ చేసింది. భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లీష్ జట్టు 81 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌పై ఇంగ్లండ్ సాధించిన అతి తక్కువ స్కోరు ఇది. రెండో ఇన్నింగ్స్‌లో టీమ్ ఇండియా స్పిన్నర్లు 10 వికెట్లు పడగొట్టగా.. టీం ఇంగ్లాండ్ ఘోరంగా విఫలం అయ్యింది. మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో అక్షర్ పటేల్ 5 వికెట్లు, అశ్విన్ 4, వాషింగ్టన్ సుందర్ ఒక వికెట్ తీసుకున్నారు.
భారత్‌తో జరిగిన తొలి డే-నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ ఇబ్బందికరమైన రికార్డు సృష్టించింది. టెస్ట్ క్రికెట్‌లో భారత్‌తో అత్యల్ప స్కోరు ఇదే. అంతకుముందు 1971లో, ఓవల్‌లో భారత్‌పై ఇంగ్లండ్ 101 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇప్పుడు 50 సంవత్సరాల తరువాత, ఇంగ్లాండ్ జట్టు తక్కువ స్కోరుకే వికెట్లన్నింటినీ కోల్పోయింది.
భారత్‌తో జరిగిన టెస్టులో ఇంగ్లాండ్ అత్యల్ప స్కోర్లు:
-81 అహ్మదాబాద్ 2020/21
-101 ఓవల్ 1971
-102 ముంబై 1979/80
-102 లీడ్స్ 1986
-112 అహ్మదాబాద్ 2020/21
ఇక 1983-84లో క్రైస్ట్‌చర్చి వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో మొదటి ఇన్నింగ్స్‌లో 93 పరుగులకే ఆలౌట్ అయిన ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్‌లో 82 పరుగులకే కుప్పకూలింది. 38 ఏళ్ల చెత్త రికార్డును ఇంగ్లండ్ సవరించింది. 81 పరుగుల అత్యల్ప స్కోరుతో ఇంగ్లాండ్ తొలి స్థానంలో నిలిచింది.
నమ్మలేని నిజం.. గర్భంతో ఉండగానే మళ్లీ గర్భం దాల్చిన మహిళ.. 3వారాల్లో రెండుసార్లు..
షాకింగ్.. భార్యను చంపింది తానేనని ఒప్పుకున్న భర్త.. కానీ, ఆ మృతదేహం 1600ఏళ్ల క్రితం నాటిది
Woman Another Pregnant : గర్భం దాల్చిన కొద్దిరోజులకే మరో గర్భం..
Dhanashree verma : చాహల్ సతీమణితో శిఖర్ ధావన్ భాంగ్రా డ్యాన్స్…అదిరిపోయింది
సిరీస్ గెలిచినా.. కోహ్లీ అసంతృప్తికి కారణం ఇదే..
Ind vs Eng: సిరీస్ కోసం ఫైనల్ ఫైట్.. గెలిచేదెవరు